Begin typing your search above and press return to search.

సెవెంత్ క్లాస్ లో 'శివ' పోస్టర్ చూశాను : 'ది ఘోస్ట్' డైరెక్టర్

By:  Tupaki Desk   |   9 July 2022 3:30 PM GMT
సెవెంత్ క్లాస్ లో శివ పోస్టర్ చూశాను : ది ఘోస్ట్ డైరెక్టర్
X
నాగార్జున కథానాయకుడిగా 'ది ఘోస్ట్' సినిమా రూపొందింది. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. నారాయణదాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. తాజాగా ఈ సినిమా నుంచి 'ది ఘోస్ట్ కిల్లింగ్ మెషిన్' పేరుతో ఒక ఈవెంట్ ద్వారా గ్లింప్స్ ను వదిలారు. అలాగే దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా పోస్టర్ వదిలారు.  ఈ వేడుకలో దర్శక నిర్మాతలు .. హీరో నాగార్జున పాల్గొన్నారు.

 ఈ వేదికపై దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ .. "కోవిడ్ కారణంగా షూటింగ్స్ లో బ్రేక్స్ రావడం జరిగింది. షూటింగుకి అనుకూలమైన సమయం మళ్లీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయవలసి వచ్చింది. కరోనా వేవ్స్ గురించి కన్నా ఈ ప్రోడక్ట్ ను ఎంత క్వాలిటీగా అందించగలం అనే దానిపైనే దృష్టి పెట్టడం జరిగింది.

నేను అనుకున్న అవుట్ పుట్ తీసుకు రావడానికి నిర్మాతలంతా కూడా ఎంతగానో సహకరించారు. ఈ వేదిక ద్వారా వాళ్లకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ల  సహకారం వల్లనే ఈ సినిమా ఇంత బాగా వచ్చిందని నేను బలంగా నమ్ముతున్నాను.

1989 అక్టోబర్ 5వ తేదీన నాగార్జున గారి 'శివ' రిలీజ్ అయింది. అప్పుడు నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను. కానీ రైల్వే ట్రాక్ దగ్గర నేను చూసిన 'శివ' పోస్టర్ నాకు ఇప్పటికీ అలా గుర్తుండిపోయింది. నేను సినిమాలు ఎక్కువగా చూసేవాడిని కాదు .. కానీ ఎందుకనో ఆ పోస్టర్ అలా గుర్తుండిపోయింది.

అలాంటి నాగార్జునగారితో సినిమా చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాగార్జున గారి పర్సనాలిటీ యాక్షన్ సినిమాలకి బాగా సెట్  అవుతుంది. అందువలన ఆయనతో నాకు ఇష్టమైన యాక్షన్ జోనర్లోనే సినిమా చేశాను.

నాగార్జునగారి స్టైల్ కి  .. సరైన యాక్షన్ సెట్ అయితే ఎలా ఉంటుందో .. ఈ సినిమా అలా ఉంటుంది. ఆయనతో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఆయన అంచనాలకి తగినట్టుగా ఈ సినిమా చేశాననే అనుకుంటున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి నా టీమ్ ఎంతో కష్టపడింది. వాళ్లందరికీ కూడా ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ చెబుతున్నాను. మిగతా విషయాలన్నీ కూడా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడతాను" అంటూ చెప్పుకొచ్చాడు.