Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: పండగ లాంటి క్షణం

By:  Tupaki Desk   |   12 Sept 2019 11:49 AM IST
ఫస్ట్ లుక్: పండగ లాంటి క్షణం
X
సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ దర్శకుడు మారుతీ కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిరోజు పండగే ఫస్ట్ లుక్ విడుదలైంది. హీరోతో పాటు వయసు మళ్ళిన పాత్రలో సత్య రాజ్ లుక్ ని ఇందులో రివీల్ చేశారు. ఇందులో ఈ ఇద్దరూ తండ్రి కొడుకులో లేక తాత మనవళ్ళో క్లారిటీ ఇవ్వలేదు కానీ మొత్తానికి ఏదో ఎమోషనల్ బాండింగ్ మీద దర్శకుడు ఈ ఇద్దరి పాత్రలను తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది .

వయసుని మరిచి ఆనందంతో ఎన్నడో దూరమైన సంబరాన్ని చాలా కాలం తర్వాత చూస్తున్నానన్న ఎక్స్ ప్రెషన్ తో సత్య రాజ్ గెటప్ తో పాటు హావభావాలు టచింగ్ గా ఉన్నాయి. ఆయన్ని వారిస్తూనే ఎంజాయ్ చేసుకోమనేలా సాయి ధరమ్ తేజ్ ఫీలింగ్స్ కూడా బాగున్నాయి. మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టుగా పోస్టర్ ద్వారానే చెప్పేసింది ప్రతి రోజు పండగే యూనిట్. డిసెంబర్ విడుదల అని పోస్టర్ లో పేర్కొన్నారు కానీ డేట్ చెప్పలేదు.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్. సుప్రీమ్ తర్వాత ఈ జోడి కలిసి నటిస్తున్న మూవీ ఇదే. గీతా ఆర్ట్స్ 2 యూవి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అవుట్ అండ్ ఫామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను మెప్పిస్తుందని మారుతీ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. లుక్ ఓకే కానీ కథకు సంబంధించిన క్లూస్ దొరకాలంటే మాత్రం టీజర్ దాకా ఆగాల్సిందే.