Begin typing your search above and press return to search.

మండే టెస్ట్ పాస్ అయిన మెగా మేనల్లుడు!

By:  Tupaki Desk   |   24 Dec 2019 5:02 AM GMT
మండే టెస్ట్ పాస్ అయిన మెగా మేనల్లుడు!
X
గత కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ నీరసంగా ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. 'వెంకీమామ' రాకతో కాస్త సందడి వచ్చింది. ఇప్పటికీ 'వెంకీమామ' థియేటర్లలో ఉండడం విశేషం. ఆ సినిమా తర్వాత వారానికి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో డబ్బింగ్ సినిమాలు పెద్దగా ప్రభావం చూపించలేకపోగా బాలకృష్ణ 'రూలర్' రెండో రోజు నుంచే నీరసం అనిపించే కలెక్షన్లను నమోదు చేస్తూ పోటీలో నిలవలేకపోయింది. ఇక మిగిలింది మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సినిమా 'ప్రతిరోజూ పండగే'.

మొదటి రోజు నుంచే డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫస్ట్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ నమోదు చేసింది. అయితే తేజు బాక్స్ ఆఫీస్ దగ్గర సోమవారం పరిక్ష పాస్ అవుతాడా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. సోమవారం నాడు 'ప్రతిరోజూ పండగే' కలెక్షన్స్ పెద్దగా డ్రాప్ కాలేదని.. నిలకడగా ఉన్నాయని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈలెక్కన మెగా మేనల్లుడు మండే టెస్ట్ పాస్ అయినట్టే. మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్ వర్క్ అవుట్ కావడంతో కుంటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకు జైకొడుతున్నారు. హీరోతో సమానంగా రావు రమేష్.. సత్యరాజ్ పాత్రలు బలంగా ఉండడం.. రావు రమేష్ తనదైన శైలిలో చెలరేగిపోవడం సినిమాకు ప్లస్ గా మారిందనే టాక్ వినిపిస్తోంది.

'వెంకీమామ' హడావుడి తగ్గడం.. డిసెంబర్ 20 న పోటీలో విడుదలైన సినిమాలన్నీ చతికిలపడడం కూడా తేజు సినిమాకు బాగా కలిసొచ్చింది. అంతే కాదు గత మూడునెలలుగా చెప్పుకోదగ్గ తెలుగు సినిమా రాలేదు. దీంతో ప్రేక్షకులు కూడా కరువులో ఉన్నారు. వీటికి తోడు క్రిస్మస్ సీజన్ కూడా కలిసిరావడంతో 'ప్రతిరోజూ పండగ' తేజు కెరీర్ లో మంచి హిట్ నిలవడం ఖాయమని అంటున్నారు. ఏదైతేనేం.. మెగా హీరోకు 'చిత్రలహరి' తర్వాత మరో హిట్ ఖాతాలో పడినట్టే.