Begin typing your search above and press return to search.

అమీ మాయ చెయ్యలేదా? పడలేదా?

By:  Tupaki Desk   |   24 Jan 2018 4:42 AM GMT
అమీ మాయ చెయ్యలేదా? పడలేదా?
X
ఏం మాయ చేశావే చిత్రంలో నటించిన చైతు-సమంతలు కూడా ప్రేమ మాయలో పడిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే వీరిద్దరూ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. ఇదే సినిమాను హిందీలో 'ఏక్ దీవానా థా' పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో మాదిరిగా హిందీలో ఈ సినిమా ఆడియన్స్ ను మాయ చేయలేకపోయింది.

ప్రతీక్ బబ్బర్.. అమీ జాక్సన్ ను ఈ హిందీ రీమేక్ చిత్రంలో నటించారు. ప్రేక్షకులను మాత్రమే కాకుండా.. హీరో హీరోయిన్లు కూడా ప్రేమ మాయలో పడిపోలేదు. ఏక్ దీవానా థా హీరో ప్రతీక్ బబ్బర్.. ఇప్పుడు కొత్త జంటను వెతికేసుకున్నాడు. సాన్యా సాగర్ అనే రైటర్ కం డైరెక్టర్ కం ఎడిటర్ తో ఏడాది కాలంగా ప్రేమలో ఉన్న ఈ కుర్రాడు.. ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా పూర్తి చేసేసుకున్నాడు. లండన్ లో గోల్డ్ స్మిత్స్ యూనివర్సిటీ నుచి ఫిలిమ్ మేకింగ్ లో పోస్ట్ గ్యాడ్యుయేట్ కోర్స్ పూర్తి చేసి.. గతేడాదే ఇండియా వచ్చి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సాన్యా.. అనతి కాలంలోనే ప్రతీక్ బబ్బర్ కంట్లో పడింది.

ఆమే తన జీవిత భాగస్వామి అని తక్కువ సమయంలోనే గుర్తించేసిన ప్రతీక్ బబ్బర్.. ప్రేమను ప్రపోజ్ చేయడం.. ఆమె ఒప్పుకోవడం జరిగిపోయాయి. రీసెంట్ గా నిశ్చితార్ధం కూడా పూర్తి చేసుకున్న వీరిద్దరూ.. పెళ్లికి మాత్రం మరి కొన్నేళ్లు వెయిట్ చేస్తామని చెబుతున్నారు. బీచ్ వెడ్డింగ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉందట ఈ హీరోకి. ఆ తర్వాత ఢిల్లీ.. లక్నో.. ముంబైలలో గ్రాండ్ రిసెప్షన్ ఇస్తామంటూ పెళ్లి ప్లానింగ్స్ చెప్పేస్తున్నాడు ప్రతీక్ బబ్బర్.