Begin typing your search above and press return to search.

ప్ర‌శాంత్ వ‌ర్మ తాజా ప్ర‌యోగం `జాంబీ రెడ్డి`

By:  Tupaki Desk   |   8 Aug 2020 10:30 AM IST
ప్ర‌శాంత్ వ‌ర్మ తాజా ప్ర‌యోగం `జాంబీ రెడ్డి`
X
జాంబీ మూవీస్ అన‌గానే హాలీవుడ్ లో `రెసిడెంట్ ఈవిల్` సిరీస్ గుర్తుకు వ‌స్తుంది. ల్యాబులో ప్ర‌యోగం ఫెయిలై వైర‌స్ అంద‌రినీ చంపేస్తుంటుంది. అలా చ‌నిపోయిన వారిలో వైర‌స్ యాక్టివేట్ అయ్యి భూమ్మీద అంద‌రినీ చంపుకు తినేస్తూ విల‌యం సృష్టిస్తుంది. అయితే ఈ విప‌త్తు నుంచి ప్ర‌పంచాన్ని కాపాడ‌టానికి పుట్టుకొచ్చిన యాక్ష‌న్ క్వీన్ క‌థ‌ల‌తో రెసిడెంట్ ఈవిల్ సిరీస్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంది. ఉత్కంఠ రేకెత్తించే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఫార్మాట్ లో ఈ జాంబీ మూవీస్ ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సిరీస్ లో కొత్త సినిమా ఏదీ రాలేదు.

ఇలాంటివి ఇండియ‌న్ సినిమాకి ఇంకా కొత్త‌నే. సౌత్ లో అస‌లే లేవు. మ‌న ఆడియెన్ అస్స‌లు ఊహించ‌లేనివి. 2019లో త‌మిళ హ‌రో జ‌యం ర‌వి న‌టించిన జాంబీ రిలీజైంది. ఈ జోన‌ర్ అంతగా ఎక్క‌లేదు. ఇటీవ‌ల ష‌ఫీ ముఖ్య పాత్రలో ఆయుష్ రామ్.. శ్రావ‌ణి హీరో హీరోయిన్లుగా జాంబి జాన‌ర్ లో తెలుగులో వసున్న మొట్టమొదటి చిత్రం `విషపురం` అంటూ ఓ ఎటెంప్ట్ చేశారు. శ్రీనివాస్ సందిరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా క్రైసిస్ వ‌ల్ల‌ రాలేదు. తాజాగా ప్ర‌శాంత్ వ‌ర్మ జాంబీ జోన‌ర్ సినిమాని ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఈ సినిమా టైటిలే ఆస‌క్తిక‌రం. జాంబీ రెడ్డి అంటూ అర్జున్ రెడ్డికి సీక్వెల్ తీస్తున్నంత బిల్డ‌ప్పిచ్చారు. జాంబీ రెడ్డి మోష‌న్ టైటిల్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. ``కొరోనా కంటే ప్రమాదకరమైనది.. మన నుండి నరకాన్ని బయటకు తీయడానికి వస్తోంది!`` అంటూ ఉత్కంఠ పెంచాడు ప్ర‌శాంత్. అ!.. క‌ల్కి లాంటి వైవిధ్య‌మైన చిత్రాల త‌ర్వాత ప్ర‌శాంత్ వ‌ర్మ మ‌రో ప్ర‌యోగానికే శ్రీ‌కారం చుట్టాడు. అతన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి! తెలుగులో మొదటి జాంబీ చిత్రమిదే అంటూ ప్ర‌చారం స్టార్ట్ చేశారు. యాపిట్ ట్రీ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కొంప‌తీసి ఈ జాంబీకి రౌడీ ల‌క్ష‌ణాలు యాడ్ చేశారో ఏమిటో!!