Begin typing your search above and press return to search.

డైరెక్టర్ స్పీడ్ ని సెకండ్ వేవ్ కూడా ఆపలేకపోయింది !

By:  Tupaki Desk   |   18 May 2021 12:30 PM GMT
డైరెక్టర్ స్పీడ్ ని సెకండ్ వేవ్ కూడా ఆపలేకపోయింది !
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. మెల్లమెల్లగా డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవలే జోంబిస్ నేపథ్యంలో జాంబిరెడ్డి సినిమా రూపొందించి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం జాంబిరెడ్డి సీక్వెల్ పై కూడా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. డెబ్యూ మూవీ 'అ!' మూవీతో టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు ప్రశాంత్. ఆ తర్వాత సెకండ్ మూవీగా కల్కి తెరకెక్కించాడు. ఆ సినిమా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది కానీ ఫలితం నిరాశపరిచింది.

అనంతరం ప్రశాంత్ మూడో మూవీగా 'జాంబీరెడ్డి'ని రూపొందించాడు. ఈ సినిమా ఇండియాలోనే ఫస్ట్ జాంబిస్ మూవీ కావడం విశేషం. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ప్రశాంత్ పలు ఓటిటి ప్రాజెక్టులకు కూడా స్క్రిప్ట్ అందిస్తున్నాడట. సినిమాలు షూటింగ్స్ ఉన్నప్పుడు ఎంత బిజీగా ఉంటారో ఇప్పుడు కూడా స్క్రిప్ట్స్ రాసుకుంటూ అంతే బిజీగా ఉన్నాడు ప్రశాంత్. ఈ విషయాన్నీ తానే స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం ప్రశాంత్ డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటిటి కోసం ఓ వెబ్ సిరీస్ స్క్రిప్ట్ అందించడం జరిగిందట. కాకపోతే డైరెక్టర్ వేరే అని చెప్పాడు ప్రశాంత్.

అలాగే మరో రెండు స్క్రిప్టులు కూడా రెడీ చేసాడట. అయితే అందులో ఒకటి హిందీలో తెరకెక్కనుండగా.. మరోటి తెలుగులో రూపొందుతుందని చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ సినిమాల సెలక్షన్ చూస్తే చాలా ఇంటరెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే రొటీన్ కాన్సెప్ట్ లకు దూరంగా ఉంటాడు ప్రశాంత్. అందుకే తదుపరి సినిమా కూడా డిఫరెంట్ జానర్ లో ఉండబోతుందని చెప్పాడు. వీటన్నిటితో పాటుగా ప్రశాంత్.. ఓ సోషియో ఫాంటసీ స్క్రిప్ట్ కూడా రెడీ చేసాడట. అయితే తదుపరి సినిమాలో స్టార్స్ ఉంటారని తెలిపాడు. అలాగే అ: సీక్వెల్ కూడా సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నాడట. కరోనా బ్రేక్ లో కూడా రెస్ట్ తీసుకోకుండా ప్రశాంత్ వర్క్ చేయడంతో ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ అయ్యాడు.