Begin typing your search above and press return to search.
'సలార్' రీ షూట్.. మంచిదేనన్న ఫ్యాన్స్
By: Tupaki Desk | 7 Dec 2021 5:00 AM ISTప్రభాస్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. ఆదిపురుష్ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లుగా ఓమ్ రౌత్ ప్రకటించారు. ప్రాజెక్ట్ కే షూటింగ్ ను ప్రారంభించినట్లుగా నాగ్ అశ్విన్ టీమ్ ప్రకటించారు.
ఇదే సమయంలో సలార్ సినిమా చిత్రీకరణకు సంబంధించిన అప్‌డేట్ కూడా వచ్చింది. ప్రాజెక్ట్ కే షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే సలార్ సినిమా షూటింగ్ ను మళ్లీ ప్రారంభించబోతున్నారు. ఇంతకు ముందు షూట్ చేసిన ఇంటర్వెల్ సీక్వెన్స్ కు సంబంధించిన ప్యాచ్ వర్క్ షూట్ ను చేయబోతున్నారట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సలార్ ఇంటర్వెల్ సీక్వెన్స్ రీ షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ యాక్షన్ సన్నివేశాల విషయంలో అస్సలు రాజీ పడడు. ఆయన అద్బుతమైన యాక్షన్ సీక్వెన్స్ ను సలార్ లో చూపించాలని ఆశ పడుతున్నాడు. అందుకే ఇంటర్వెల్ సీక్వెన్స్ యాక్షన్ సన్నివేశాలు ఆయనకు సంతృప్తిని ఇవ్వలేదట. అందుకే మళ్లీ వాటిని రీ షూట్ చేస్తాడని అంటున్నారు.
అభిమానులు సహజంగా అయితే రీ షూట్ నిర్ణయాన్ని తప్పుబడుతారు. బ్యాడ్ సెంటిమెంట్ గా అనుకుంటారు. కాని సలార్ రీ షూట్ ను మాత్రం అభిమానులు స్వాగతిస్తున్నారు. ప్రభాస్ సలార్ సినిమా రావడానికి చాలా సమయం ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ వంటి దర్శకుడు భారీ ఎత్తున సినిమాను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఇలాంటి రీ షూట్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.
కేజీఎఫ్ 2 కోసం కూడా పలు సందర్బాల్లో రీ షూట్ లకు ప్రశాంత్ నీల్ వెళ్లాడట. అందుకే సలార్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ రీ షూట్ ప్లాన్ చేయడం మంచిదే అన్నట్లుగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హీరో ప్రభాస్ మరియు నిర్మాణ సంస్థ కూడా సలార్ రీ షూట్ విషయంలో ప్రశాంత్ నీల్ నిర్ణయానుసారం వెళ్లాలని భావిస్తున్నారట. ముందుగా అనుకున్న ప్రకారం సలార్ సినిమా ఈ సంక్రాంతికే విడుదల అవ్వాల్సి ఉంది. కాని కరోనా సెకండ్ వేవ్ తో సినిమా మొత్తం షూటింగ్ పూర్తి కాలేదు.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 పనిలో ఉన్నట్లుగా కన్నడ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రభాస్ ప్రాజెక్ట్ కే షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే సలార్ ను ముగించే వరకు కంటిన్యూస్ గా షూట్ ఉండే అవకాశం ఉందంటున్నారు.