Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ 3 చేయాల్సిందే.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   23 Jun 2022 1:30 PM GMT
కేజీఎఫ్‌ 3 చేయాల్సిందే.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
X
కేజీఎఫ్ 1 భారీ విజయం సాధించడంతో పాటు దేశ వ్యాప్తంగా కేజీఎఫ్‌ అనే పేరు మారు మ్రోగిపోయింది. దాంతో కేజీఎఫ్ 2 పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కేజీఎఫ్ 2 ను దర్శకుడు ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఇండియాస్ బిగ్గస్ట్‌ మూవీస్‌ జాబితాలో కేజీఎఫ్ 2 నిలిచింది.

అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచిన కేజీఎఫ్ 2 కు మూడవ పార్ట్‌ ఎప్పుడు వస్తుందా అంటూ ప్రతి ఒక్కరు వెయిట్‌ చేస్తున్నారు.

కేజీఎఫ్ 3 ఖచ్చితంగా ఉంటుందని నిర్మాణ సంస్థ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. తాజాగా అదే విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫుల్‌ క్లారిటీతో చెప్పుకొచ్చాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ నీల్‌ మాట్లాడుతూ... కేజీఎఫ్ 3 చేయాల్సిందే అన్న పరిస్థితిలో మేము ఉన్నాం. కేజీఎఫ్ ను మరియు హీరో పాత్రను అభిమానిస్తున్న వారు కేజీఎఫ్ 3 ని చేయకుంటే ఊరుకునే పరిస్థితి లేదు. అందువల్ల కేజీఎఫ్‌ 3 ని చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. కేజీఎఫ్ 2 కు ముందే కేజీఎఫ్‌ 3 కోసం కొన్ని లైన్స్ ను కూడా అనుకున్నట్లుగా ప్రశాంత్‌ నీల్‌ తెలియజేశాడు.

కేజీఎఫ్‌ 3 ఎప్పుడు ఉంటుంది అనే విషయం లో ఆయన స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. ప్రస్తుతానికి నాకు కేజీఎఫ్‌ 3 గురించి కనీసం ఆలోచించేంత సమయం కూడా లేదు అన్నట్లుగా ప్రశాంత్‌ నీల్‌ చెప్పుకొచ్చాడు. స్టార్‌ హీరోలతో బ్యాక్ టు బ్యాక్‌ సినిమా లు చేస్తున్న ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 3 లో ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోలను పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

కేజీఎఫ్ 2 తో యశ్‌ కూడా పాన్‌ ఇండియా బ్లాక్‌ బస్టర్ స్టార్‌ అయ్యాడు. అద్బుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్న యశ్‌ తదుపరి సినిమా ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్‌ 3 లో ఆయన ఉండాలి.. ఆయనతో పాటు సలార్‌ స్టార్‌ ప్రభాస్ కూడా ఉండాలని అభిమానులు ముఖ్యంగా కేజీఎఫ్ సిరీస్ ను ఇష్టపడే వారు కోరుకుంటున్నారు.