Begin typing your search above and press return to search.

అ!క్కడ తేలిన కొత్త దర్శకుడు

By:  Tupaki Desk   |   26 April 2018 5:11 AM GMT
అ!క్కడ తేలిన కొత్త దర్శకుడు
X
అ! అంటూ ఓ వెరైటీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇతను చెప్పిన స్టోరీ నెరేషన్ విని.. తనే నిర్మాతగా అవతరించేశాడు హీరో నాని. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను కొత్త తరహాగా.. విభిన్నమైన స్క్రీన్ ప్లేతో చెప్పిన తీరుకు చాలానే ప్రశంసలు దక్కాయి.

బోలెడంత మంది స్టార్లు.. విభిన్నమైన నెరేషన్ అంటూ మంచి గుర్తింపు వచ్చినా.. కమర్షియల్ గా మాత్రం మూవీ సక్సెస్ కాలేకపోయింది. కానీ ప్రశాంత్ వర్మ మేకింగ్ కు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడీ దర్శకుడు తన మరుసటి చిత్రం కోసం ప్రిపేర్ అయిపోతున్నాడు. ఈ సారి కూడా విభిన్నమైన కథాంశంతో.. ప్రయోగాత్మక చిత్రాన్నే చూపించబోతున్నాడట. ఈ సారి థ్రిల్లర్ అనే ఎలిమెంట్ హైలైట్ గా నిలుస్తుందనే టాక్ ఉంది. చివరకు మనోడు ఏ హీరో క్యాంపులో తేలాడో తెలుసా? సీనియర్ హీరో రాజశేఖర్ ను ఇంప్రెస్ చేశాడట.

రీసెంట్ గా పీఎస్వీ గరుడవేగ చిత్రంతో తిరిగి ఫాం లోకి వచ్చాడు రాజశేఖర్. మంచి సినిమా తన ఖాతాలో పడితే.. ఏ స్థాయిలో వసూళ్లు రాబట్టగలడో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ప్రశాతం్ వర్మతో రాజశేఖర్ మూవీ అనగానే ఆసక్తి జనరేట్ అవుతోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు పూర్తయిపోగా.. సమ్మర్ తర్వాత ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.