Begin typing your search above and press return to search.

వర్మనే మెప్పించిన మరో వర్మ

By:  Tupaki Desk   |   19 Feb 2018 8:55 AM GMT
వర్మనే మెప్పించిన మరో వర్మ
X
తన ట్వీట్లు - వీడియోలతో ఎప్పుడు ఏదో ఒక సంచలనం రేపుతూ ఉండే రామ్ గోపాల్ వర్మను మెప్పించడం అంటే అంత ఈజీ కాదు. పైగా తన మెసేజులు తప్ప ఇతరులవి షేర్ చేయడానికి అంతగా ఇష్టపడని వర్మను సైతం మెప్పించాడో కుర్ర డైరెక్టర్. అతనే ప్రశాంత్ వర్మ. నాని నిర్మించిన అ!తో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చిన ఈ దర్శకుడు ఆ సినిమాతో కమర్షియల్ గా ఎంత పెద్ద విజయం సాధించాడు అనే దాన్ని పక్కన పెడితే ఓ పట్టాన ఏ సినిమాను మెచ్చని క్రిటిక్స్ ని సైతం తన టేకింగ్ తో మెప్పించాడనే చెప్పాలి. ఇంత జరిగాక వర్మ దృష్టిలో పడకుండా ఉంటాడా. అ! ను రామ్ గోపాల్ వర్మ ఇంకా చూసాడో లేదో కాని ప్రశాంత్ వర్మ మాత్రం తన ట్వీట్ తో వర్మ తో అ! అనిపించేసాడు. అదేంటో చూడండి.

అ!కు వస్తున్న స్పందన గురించి తన ట్విట్టర్ లో షేర్ చేసుకుంటున్న ప్రశాంత్ వర్మ అందులో భాగంగా అందరు తనను రామ్ గోపాల్ వర్మ తో పోల్చుతున్నారని చెబుతూ - తామిద్దరికీ ఇంటి పేరు వర్మ - అభిమాన నటి శ్రీదేవి అనే రెండు విషయాల్లో తప్ప దేంట్లోనూ పోలిక లేదని తేల్చేసాడు. ఇక్కడ పోగిడినట్టు ఉంది - పంచ్ వేసినట్టు ఉంది. వర్మ లాంటి లెజెండ్ తో తనకు పోలిక లేదు అని చెప్పడం ఒక యాంగిల్ లో అర్థం చేసుకుంటే మరో యాంగిల్ లో వర్మ లాంటి పనులు - సినిమాలు - ట్వీట్లు నేను చేయను అని చెప్పడం కూడా మీనింగ్ వస్తుంది. ఏదైతేనేం ఇది వర్మను కూడా ఆకట్టుకుంది. అంతే షేర్ చేసుకున్నాడు.

వర్మనే మెప్పించిన ప్రశాంత్ వర్మ సామాన్యుడు కాడు అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. తన దగ్గర ముప్పై దాకా కథలు ఉన్నాయని చెబుతున్న ఇతను తన తర్వాతి సినిమా ఎవరితో తీస్తాడో మాత్రం చెప్పడం లేదు. సెకండ్ మూవీ కూడా పేరున్న బ్యానర్ లోనే ఉండబోతోంది అని ఇన్ సైడ్ టాక్.