Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ డైరెక్టర్‌ సినిమాల ఆర్డర్.. కన్ఫ్యూజన్‌ క్లీయర్‌

By:  Tupaki Desk   |   3 Dec 2021 2:30 AM GMT
కేజీఎఫ్‌ డైరెక్టర్‌ సినిమాల ఆర్డర్.. కన్ఫ్యూజన్‌ క్లీయర్‌
X
కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కేజీఎఫ్‌ తో ఒక్కసారిగా స్టార్‌ దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. పాన్‌ ఇండియా రేంజ్ లో కేజీఎఫ్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఆయన దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ 2 కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. కనుక కేజీఎఫ్ 2 తర్వాత ఆయన తో సినిమాలు చేసేందుకు స్టార్‌ హీరోలు.. నిర్మించేందుకు పెద్ద నిర్మాతలు క్యూ లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఏ సినిమా ఎప్పుడు అనేది కాస్త కన్ఫ్యూజ్ గా ఉంది. ఈయన తదుపరి నాలుగు అయిదు సినిమా లు కూడా తెలుగు హీరోలతోనే ఉండబోతున్నాయి అనేది ఫిక్స్.. కాని ఏ హీరోతో మొదలు.. ఏ హీరోతో చివర అనే విషయంలో మాత్రం క్లారిటీ లేక హీరోల అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.

మాకు అందిన సమాచారం ప్రకారం కేజీఎఫ్‌ 2 విడుదల అయిన తక్కువ సమయంలోనే ప్రభాస్‌ తో తెరకెక్కిస్తున్న సలార్‌ సినిమాను విడుదల చేయబోతున్నాడు. కేజీఎఫ్‌ 2 మరియు సలార్ సినిమా లు 2022 లో విడుదల ఉండే అవకాశం ఉంది అంటున్నారు. సలార్ సినిమా తర్వాత కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్ సినిమా చరణ్‌ తో ఉంటుందట. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ చర్చలు జరిగాయి. ఆమద్య చిరంజీవి మరియు చరణ్‌ తో ఉన్న ఒక ఫొటోను షేర్‌ చేసి సినిమాను అఫిషియల్‌ చేయడం జరిగింది. చరణ్ తో తీయబోతున్న సినిమా లో చిరంజీవి కూడా కీలక పాత్ర లేదంటే గెస్ట్‌ రోల్‌ ను చేసే అవకాశం ఉందని అంటున్నారు. 2023 ఆరంభంలో చరణ్‌.. ప్రశాంత్‌ నీల్ ల కాంబో సినిమా ఉంటుందట. ఆ తర్వాత ఎన్టీఆర్‌ తో ఒక సినిమా ను ప్రశాంత్‌ నీల్‌ చేయబోతున్నాడు. ఎన్టీఆర్ తో సినిమా పూర్తి అయ్యాక అల్లు అరవింద్‌ బ్యానర్ గీతా ఆర్ట్స్ లో ప్రశాంత్‌ సినిమాను చేయబోతున్నాడట.

2023 లేదా 2024 లో అల్లు అరవింద్‌ నిర్మాణంలో ప్రశాంత్‌ నీల్ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్ లో ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా లో హీరో ఎవరు అనే విషయమై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. మహేష్‌ బాబు డేట్లు ఇప్పటికే అల్లు అరవింద్‌ వద్ద ఉన్నాయి.. అలాగే ప్రశాంత్‌ నీల్‌ తో సినిమా చేయాలని మహేష్‌ బాబుకు ఉంది. కనుక ఈ ముగ్గురి కలయిక ఉండే అవకాశం ఉంది. ఒక వేళ అప్పటికి రాజమౌళి సినిమా తో మహేష్‌ బాబు బిజీ అయితే మాత్రం అల్లు అర్జున్‌ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సినిమాను నిర్మించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. మొత్తానికి కేజీఎఫ్‌ దర్శకుడి సినిమా లైనప్ ఓ రేంజ్ లో ఉంది. ఆ సినిమాలు అన్ని కూడా సక్సెస్‌ అయితే పాన్ ఇండియా స్టార్‌ హీరో అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయంటున్నారు.