Begin typing your search above and press return to search.

`స‌లార్` కి ఆ ర‌కంగా ముప్పు త‌ప్పిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   17 Dec 2020 10:20 AM GMT
`స‌లార్` కి ఆ ర‌కంగా ముప్పు త‌ప్పిన‌ట్టేనా?
X
ప్ర‌శాంత్ నీల్- హోంబ‌లే బృందం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల‌తో అగ్గి రాజేస్తున్నారు. ప్ర‌క‌టించేవ‌న్నీ భారీ పాన్ ఇండియా సినిమాలే కావ‌డంతో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్ 2 చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి రిలీజ్ చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉండ‌గా.. మ‌రోవైపు డార్లింగ్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా స‌లార్ లాంటి భారీ పాన్ ఇండియా మూవీని ప్ర‌క‌టించారు. ప్ర‌శాంత్ నీల్- హోంబ‌లే పిలింస్ బృందం ఈ మూవీని దేశంలోనే అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంగా మ‌లిచే ప్లాన్ లో ఉన్నారు.

కేజీఎఫ్ 2 - స‌లార్ చిత్రాల గురించి చ‌ర్చ సాగుతుండ‌గానే మ‌రో భారీ ప్ర‌క‌ట‌న హోంబ‌లే సంస్థ నుంచి రావ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్. `భ‌గీర` అంటూ డార్క్ పోస్ట‌ర్ తో ర‌చ్చ లేపారు. శ్రీ మురళీ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు. అయితే ఈ చిత్రానికి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కుడు కాదు. అత‌డు కథను మాత్రమే అందిస్తాడు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తారు.

ఈ ప్ర‌క‌ట‌న‌తో ఒక ర‌కంగా ప్ర‌భాస్ స‌లార్ కి ఎలాంటి అడ్డంకుల్లేవని ప్రూవైంది. ప్ర‌శాంత్ నీల్ పూర్తిగా స‌లార్ పైనే దృష్టి సారించి ప‌ని చేయ‌నున్నారు. ఇక ప్ర‌శాంత్ నీల్ - ప్ర‌భాస్ మూవీ స‌లార్ కాన్సెప్ట్ ప్ర‌శాంత్ గ‌తంలో తెర‌కెక్కించిన ఉగ్ర‌మ్ మూవీకి సీక్వ‌ల్ అన్న ప్ర‌చారానికి భ‌గీర ప్ర‌క‌ట‌నతో చెక్ పెట్టేసిన‌ట్ట‌య్యింది. బ‌హుశా ఉగ్ర‌మ్ సీక్వెల్ భ‌గీర అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బ‌ఘీర అంటూ క‌న్న‌డ వ్య‌వ‌హారికంలో పిలుస్తున్న ఈ మూవీ క‌థాంశం భ‌గీర‌థ ప్ర‌య‌త్నానికి సిద్ధ‌మ‌య్యే యువ‌కుడి క‌థేన‌ని ఊహిస్తున్నారు.