Begin typing your search above and press return to search.
'కేజీఎఫ్' దర్శకుడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇద్దరిలో ఎవరితో ఉంటుందో..!
By: Tupaki Desk | 29 Nov 2020 5:00 AM ISTకేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దక్షిణాది నుంచి వచ్చి పాన్ ఇండియా స్థాయిలో మెప్పించిన సినిమాల్లో ఒకటిగా 'కేజీఎఫ్' ని నిలిపాడు. హీరోయిజమ్ చూపించడంలో.. హీరో ఎలివేషన్ సీన్స్ తెరకెక్కించడంలో తనకు సాటిలేరని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ 2’ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రశాంత్ తో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ప్రశాంత్ తో ఓ సినిమాకి ఒప్పందం కుదుర్చుకుందని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే తారక్ కి ఓ పవర్ ఫుల్ స్టోరీ నెరేట్ చేశాడని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్'.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. దీంతో ఇప్పట్లో ప్రశాంత్ - తారక్ కాంబోలో సినిమా ఉండకపోవచ్చు. ఇదే సమయంలో ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ స్టోరీ గురించి డిస్కషన్ చేశాడని టాక్ వచ్చింది. తాజాగా ప్రశాంత్ నీల్ డార్లింగ్ ను కలిసారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరు సినిమా గురించే మాట్లాడుకున్నారని అంటున్నారు. మరి ప్రశాంత్ నీల్ తదుపరి ప్రాజెక్ట్ ప్రభాస్ తో ఉంటుందా లేదా ఎన్టీఆర్ తో ఉంటుందా అనేది చూడాలి. 'కేజీఎఫ్ 2' రిలీజ్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.