Begin typing your search above and press return to search.

అతని కోసం మహేష్ తారక్ ఫ్యాన్స్ రచ్చ?

By:  Tupaki Desk   |   11 Sep 2019 4:46 AM GMT
అతని కోసం మహేష్ తారక్ ఫ్యాన్స్ రచ్చ?
X
మొన్న సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సరిలేరు నీకెవ్వరు సెట్ కు వచ్చి ప్రత్యేకంగా సమావేశం కావడం ఫిలిం నగర్ లో పెద్ద చర్చకే దారి తీసింది. ఈ కాంబినేషన్ లో సినిమా ఖాయమని యష్ లాంటి అప్ కమింగ్ హీరోకే అంత స్టార్ డం తెచ్చిన డైరెక్టర్ ఇక మహేష్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో అనే అంచనాలలో అభిమానులు మునిగిపోయారు. వాస్తవానికి మైత్రి బ్యానర్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఉంటుందని గతంలోనే వార్త వచ్చింది. అది నిజమే అనేలా జరిగిన కొన్ని ప్రకటనలు దానికి బలాన్నిచ్చాయి.

ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రిన్స్ ల మీటింగ్ చూస్తుంటే అసలు అది వాయిదా పడిందా లేక ఇంకో ఏడాది లేదా రెండేళ్ళ తర్వాత తీయబోయే సినిమాకు ఇప్పుడే స్టొరీ డిస్కషన్ చేశారా అనే అనుమానం వస్తోంది. దీని సంగతి అలా ఉంచితే సోషల్ మీడియాలో మాత్రం మహేష్ తారక్ అభిమానులు కేజిఎఫ్ ప్రశాంత్ నీల్ తమ హీరోతో చేస్తాడంటే తమ హీరోతో చేస్తాడని నానా రచ్చ చేసుకుంటున్నారు. అప్పుడే పోలికలు కూడా పెట్టేసుకుంటున్నారు. నిజంగా ప్రశాంత్ నీల్ ఎవరితో చేసినా దాని హైప్ మాములుగా ఉండదు.

కాకపోతే ఇక్కడో విషయం మర్చిపోకూడదు. కేజిఎఫ్ 2 షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. ఇటీవలే కోర్టు స్టే ఇచ్చింది. ఒకవేళ క్లియరెన్స్ వచ్చినా ఎంత లేదన్నా వచ్చే ఏడాది దసరాకు కాని పూర్తయ్యేలా లేదు. ఫస్ట్ పార్ట్ తరహాలోనే రిలీజ్ ని డిసెంబర్ కు ప్లాన్ చేసుకున్నారు. సో అప్పటిదాకా ప్రశాంత్ నీల్ ఖాళీగా ఉండడు. మరి ఇంతలో ఈ కన్ఫ్యూజన్ ఏమిటో అతనే చెబితే బాగుంటుంది