Begin typing your search above and press return to search.
నాని తో మూవీ ప్లాన్ చేస్తున్న ‘కేజీఎఫ్’ డైరెక్టర్...?
By: Tupaki Desk | 24 Jun 2020 11:15 AM ISTసౌత్ ఇండస్ట్రీ నుండి విడుదలై పాన్ ఇండియా స్థాయిలో మెప్పించిన సినిమా ‘కేజీఎఫ్’. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. పదుల సంఖ్యలో సినిమాలు చేసిన అనుభవం అయితే లేదు గానీ మాస్ ప్రేక్షకులను ఎలా కట్టిపడేయాలన్న కిటుకు మాత్రం తెలుసు. హీరోయిజమ్ చూపించడంలో.. హీరో ఎలివేషన్ సీన్స్ తెరకెక్కించడంలో ప్రశాంత్ కి సాటిలేరని 'కేజీఎఫ్' సినిమాతో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో మన టాలీవుడ్ స్టార్ హీరోల చూపు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై పడింది.
ప్రశాంత్ నీల్ కి తెలుగు ఆడియెన్స్ లో పెద్దగా క్రేజ్ లేకపోవచ్చు కానీ తెలుగు హీరోలు మాత్రం అతనితో వర్క్ చేయాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఇక తన నెక్స్ట్ సినిమా తెలుగులోనే ఉండబోతోందని వార్తలు ఊపందుకున్నాయి. దీనికి తగ్గట్టు ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నెక్స్ట్ సినిమా కోసం ప్రశాంత్ తో ఒప్పందం చేసుకుందని సమాచారం.
ఇటీవలే ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ విషెస్ చెప్తూ ''గొప్ప మనసు కలిగిన సెన్సేషనల్ డైరెక్టర్ కి శుభాకాంక్షలు. త్వరలో మిమ్మల్ని రేడియేషన్ సూట్ లో కలవబోతున్నాం'' అని ట్వీట్ చేసారు. దీంతో వీరి కాంబోలో మూవీ ఉండబోతోందని క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఆఫీసియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
కాగా ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ కంటే ముందు మరో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడని సమాచారం. ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ 2' సినిమా తర్వాత పాన్ సౌత్ ఇండియా రేంజ్ లో ఓ సినిమా చేయబోతున్నాడట. అంతేకాకుండా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించబోతున్నాడట. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో నేచులర్ స్టార్ నాని హీరోగా నటించబోతున్నాడట. ఈ మధ్య ప్రొడక్షన్ లోకి కూడా దిగిన నాని ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కి ఒక నిర్మాతగా కూడా వ్యవహరించడానికి సిద్ధపడ్డాడట.
ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికే ప్రశాంత్ తో సినిమా ప్లాన్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాడట. ఇలా ఎన్టీఆర్ - నాని - ప్రశాంత్ నీల్ కలయికలో ఓ మూవీ రాబోతోందన్నమాట. తెలుగు హీరోలు సైతం ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చేంతగా ఈ ప్రాజెక్ట్ లో ఏముందో ప్రశాంత్ కే తెలియాలని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.