Begin typing your search above and press return to search.

మళ్లీ 'సలార్' స్క్రిప్ట్ పై కూర్చున్న 'కేజీయఫ్' డైరెక్టర్..?

By:  Tupaki Desk   |   10 May 2022 11:30 PM GMT
మళ్లీ సలార్ స్క్రిప్ట్ పై కూర్చున్న కేజీయఫ్ డైరెక్టర్..?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ''సలార్''. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'కేజీఎఫ్' తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్.. ఇప్పుడు 'కేజీయఫ్: చాప్టర్ 2' చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టారు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 1150 కోట్లకు పైగా వసూళ్లతో 2022 బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. దీంతో ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రం పై అందరి దృష్టి పడింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ తో ''సలార్'' సినిమాలో ప్రభాస్ ను ఊర మాస్ అవతార్ లో ప్రెజెంట్ చేయబోతున్నారని స్పష్టత వచ్చేసింది.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలిం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'సలార్' లొకేషన్స్ నుంచి లీకైన ఫోటోలు చూసి హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ - ఎలివేషన్స్ లో ప్రభాస్ ను ఊహించుకుంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే వారిని నిరుత్సాహ పరిచే ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నిజానికి 'సలార్' చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కరోనా పాండమిక్ నేపథ్యంలో ప్లాన్స్ అన్నీ తారుమారు అయ్యాయి. దీంతో ప్రభాస్ చిత్రాన్ని వాయిదా వేసి.. ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్ 2' చిత్రాన్ని అదే తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఫ్రీ అయిపోయాడు కాబట్టి.. 'సలార్' సినిమాని వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లి వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తారని అందరూ భావించారు. అయితే ఈ సినిమా రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టేలా ఉందని టాక్ వినిపిస్తోంది.

'కేజీఎఫ్ 2' సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన నేపథ్యంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించే 'సలార్' చిత్రంపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. దీనికి తోడు 'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో' 'రాధేశ్యామ్' సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. దీంతో డార్లింగ్ నుంచి రాబోయే చిత్రాలు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్స్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దర్శకుడు ప్రశాంత్ మళ్లీ 'సలార్' స్క్రిప్ట్‌ పై పని చేస్తున్నారట. అందుకే ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి టైం పడుతుందని అంటున్నారు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే.. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా టీజర్ ను ఈ నెలాఖరున విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

'సలార్' చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు - పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. హనుమాన్ చౌదరి డైలాగ్స్ రాస్తున్నారు.