Begin typing your search above and press return to search.

బేబమ్మను ఏడిపించిన చిల్లర బ్యాచ్ యాంకర్స్‌

By:  Tupaki Desk   |   30 May 2022 7:41 AM GMT
బేబమ్మను ఏడిపించిన చిల్లర బ్యాచ్ యాంకర్స్‌
X
ఇటీవల ఒక తెలుగు యంగ్‌ హీరో ఫ్రాంక్ వీడియో చేయడం వల్ల ఎంతటి రచ్చ అయ్యిందో అందరికి తెల్సిందే. ఆ హీరో ఫ్రాంక్ రచ్చ తర్వాత చాలా మంది అసలు ఫ్రాంక్‌ వీడియోలను బ్యాన్ చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. తెలుగు యూట్యూబర్స్‌ చాలా మంది ఫ్రాంక్‌ వీడియోలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తూ ఉన్నారు. వారిలో కొందరు ఫ్రాంక్ పేరుతో చెత్త పనులు చేస్తున్నారు.

అమాయకులను.. చదువురాని వారిని అవహేళన చేసినట్లుగా వ్యవహరించడంతో పాటు.. కొందరు స్క్రిప్ట్ ఫ్రాంక్ వీడియో లతో జనాలను బకరాలను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాకుండా ఈమద్య కాలంలో స్టార్స్ పై ముఖ్యంగా హీరోయిన్స్ పై ఫ్రాంక్ వీడియోలు చేయడం చాలా కామన్‌ విషయం అయ్యింది.

హీరోయిన్స్ అమాయకులు.. వారు చాలా ఎమోషనల్‌ గా ఉంటారు.. అందువల్ల వారిపై ఫ్రాంక్‌ వీడియోలు చేస్తే రక్తి కట్టవచ్చు అనుకునే వారు చాలా మంది ఉన్నారు.

ఇటీవల ఒక తమిళ టీవీ ఛానల్ యాంకర్స్ ఉప్పెన హీరోయిన్‌ కృతి శెట్టిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ కు ముందు కృతిని మొదట ప్రశ్నలు నేను అడుగుతాను అంటే నేను అడుగుతాను అంటూ గొడవ పడ్డారు. ఇద్దరు కూడా కొట్టుకునే వరకు వెళ్లారు. ఇద్దరు కూడా కృతి ముందు పిడిగుద్దులు గుద్దుకుంటూ ఉంటే ఆమె అలా చూస్తూ షాక్‌ లో ఉండి పోయింది.

కొద్ది సమయం తర్వాత వారిద్దరు ఇది ఫ్రాంక్‌ అంటూ చెప్పడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కాస్త నవ్వినట్లుగా అనిపించినా కూడా ఆమె గుండె జారి పోయినట్లుగా ఫేస్ పెట్టింది. మరీ ఇలాంటి ఫ్రాంక్స్ ఏంట్రా బాబు అంటూ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో వీక్‌ హార్ట్‌ అమ్మాయిలు అయితే ఏకంగా గుండె పోటు వచ్చినా ఆశ్చర్యం లేదు.

ఇలాంటి చిల్లర ఫ్రాంక్ లను రోడ్ల మీద చేసుకుంటే ఏమైనా బాగుంటుంది. కాని ఇలా హీరోయిన్స్ ముందు చేసి వారి ఎమోషన్స్ తో ఆడుకోవడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ నెజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆ తమిళ యాంకర్స్ ఇప్పటికే ఫ్రాంక్ కు సారి చెప్పారు. కృతి శెట్టి సరే అన్నట్లుగా ఊరుకుంది.. కాని ముందు ముందు ఇలాంటి చాలానే జరిగేందుకు ఇది ఒక ఆజ్యం గా మారుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.