Begin typing your search above and press return to search.

పూజల్లో బాపుబొమ్మ బిజీ!!

By:  Tupaki Desk   |   4 Aug 2017 5:00 AM GMT
పూజల్లో బాపుబొమ్మ బిజీ!!
X
సాదారణంగా మన హీరోయిన్లు ఖాళీగా ఉంటే టూర్లకు వెళ్తారు లేకపోతే పార్టీలుకు వెళ్తారు. లేదా ఏదైనా ఈవెంట్ కి అవార్డ్ షో లుకు వెళుతూ ఉంటారు. కానీ ఎప్పుడో కానీ గుళ్లూ పుణ్యస్థానాలు అంటూ కనిపించరు. అలా వెళ్లారు అంటే ఏదో అశాంతి పూజ ఒకటి జరిపించుకొని వస్తూ ఉంటారు. కెరియర్ ఇప్పుడు కొంచం నెమ్మదిగా నడుస్తున్న బాపు బొమ్మ ప్రణీత సుభాష్ కూడా రెగ్యులర్ జీవితం నుండి కొంచం ప్రశాంతత కోసం కొండ పై ఉన్న దేవుడు దగ్గరకు వెళ్లింది.

మన తెలుగు పోకిరి సినిమాను కన్నడంలో రీమేక్ చేశారు. ఆ కన్నడ సినిమా ద్వారా సినిమా హీరోయిన్ గా మారిన మోడల్ ప్రణీత సుభాష్.. మన తెలుగు సినిమాలలో కూడా బాగానే కనిపించింది. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కల్యాణ్ కు మరదలుగా నటించిన ప్రణీత రెండు రోజులు కిందట కాళహస్తిలోని ముక్కంటి ఆలయ దర్శనం కోసం వెళ్లింది. ఆలయంలోని సహస్రలింగేశ్వరుని సన్నిధి వద్ద రాహు-కేతు సర్పదోష నివారణ పూజలను చేసిందిట. అక్కడ గుడి ప్రధాన అర్చకులు దగ్గరుండి పూజలు అన్నీ చేపించి ఆలయం తరఫున తీర్థ ప్రసాదాలను అందజేశారట.

ముక్కంటి ఆలయ దర్శనం తరువాత అక్కడే ఉన్న అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా జరిపించిందని తెలుస్తుంది. బ్రహ్మోత్సవం తరువాత తెలుగులో కనిపించడం మానేసిన ఈ కన్నడ సుందరి కొన్ని కన్నడ తమిళ్ సినిమాలతో బాగానే నెట్టుకు వస్తుంది. తమిళ్లో చేస్తున్న సినిమాలు ఈ ఏడాది విడుదలకు కూడా సిద్దంగా ఉన్నాయి. ప్రణీత ఇప్పుడు సినిమా హీరోయిన్ కెరియర్ పై కన్నా బిజినెస్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంది అని చెబుతున్నారు. ఈ మధ్యనే బెంగుళూరులో రెండు రెస్టారెంట్లను స్టార్ట్ చేసింది. బూట్ లెగ్గర్ అనే పబ్ కు ఈమె ఓనర్.