Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: కన్నడ బ్యూటీ జిల్ జిల్ పోజులు

By:  Tupaki Desk   |   12 May 2019 6:04 AM GMT
ఫోటో స్టొరీ: కన్నడ బ్యూటీ జిల్ జిల్ పోజులు
X
ప్రణీత సుభాష్ తెలుసు కదా? అయినా ప్రణీత పేరు ఎవరైనా ఎలా మర్చిపోతారు లెండి? పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఫిలిం 'అత్తారింటికి దారేది'లో ఒక హీరోయిన్ గా నటించడమే కాకుండా 'బాపు గారి బొమ్మ' సాంగ్ లో పవన్ తో కలిసి స్టెప్పులు వేయడంతో నిజంగా బాపుబొమ్మ కాకపోయినా బాపుబొమ్మ అయిపోయింది. ఈ భామ గత కొంతకాలంగా కన్నడ సినిమాల్లోనే నటిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ లో నటించింది కానీ దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

తాజాగా ఈ భామా ప్రోవోక్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ కవర్ పేజిపై మెరిసింది. మే నెల ఎడిషన్లో ప్రణీతపై "మీరు బంధనాలను తెంచుకోవాలంటే రెబెల్ అయి ఉండాల్సిన పని లేదు" అనే టైటిల్ తో ఒక పెద్ద కథనం కూడా ప్రచురించారు. కవర్ పేజిపై కలర్ఫుల్ గానే ఉన్న ప్రణీత లోపలి పేజీల్లో మాత్రం తన అందాలను ధారపోసింది. స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ జలకన్యలా మారిపోయి నెటిజనుల వేడిని పెంచే కార్యక్రమం చేపట్టింది. జస్ట్ బికిని అంటే రొటీన్ గా ఉంటుందని అనుకుందేమో కానీ పారదర్శకంగా ఉండే డ్రెస్ లాంటి బికినీని ధరించింది. ఒక ఫోటోలో జుట్టును ఫ్లిప్ చేస్తూ ఉన్నప్పుడు నీళ్ళు ఒక ధారగా పడతాయి.. కదా అలాంటిది. ఆ ఫోటో టైమింగ్ అయితే సూపరో సూపర్.

ఇలా రెచ్చిపోయి మరీ పోజులు ఇవ్వడంతో ఫోటోలకు సోషల్ మీడియాలో స్పందన మామూలుగాలేదు. ఇటు ట్విట్టర్ లోనూ.. అటు ఇన్స్టాలోనూ నెటిజనులు లైకులు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. ప్రణిత సుభాష్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రణీత కన్నడ చిత్రం 'రమణ కుమార' లో నటిస్తోంది. తెలుగులో అయితే ఏమీ ఆఫర్లు లేవు. మరి ఈ జలకాలటలు.. కిలకిల పాటలు.. జిల్ జిల్ ఫోటోలు ఆ ఆఫర్ల కోసమేనేమో!