Begin typing your search above and press return to search.

మిర్ర‌ర్ హౌస్‌ లో బేబీ డాల్‌!

By:  Tupaki Desk   |   15 Dec 2020 3:43 PM GMT
మిర్ర‌ర్ హౌస్‌ లో బేబీ డాల్‌!
X
ప్ర‌ణీత సుభాష్‌.. లాక్ ‌డౌన్ స‌మ‌యంలో సోను సూద్ త‌రువాత ప్ర‌ముఖంగా ద‌క్షిణాదిలో వినిపించిన పేరిది. క‌రోనా క‌రాళ నృత్యం చేస్తున్న వేళ ప్ర‌ణీత ఆక‌లితో వున్న పేద‌వారికి అన్నం పెడుతూ వార్త‌ల్లో నిలిచింది. కెరీర్ ప‌రంగా హీరోయిన్‌గా తెలుగులో చెప్పుకోద‌గ్గ అవ‌కాశాల్ని ద‌క్కించుకున్నా ఆ స్థాయిలో మాత్రం స‌క్సెస్ కాలేక‌పోయింది. పేరుకు పెద్ద చిత్రాల్లో న‌టించినా అందులో సెకండ్ హీరోయిన్ త‌రహా పాత్ర‌లే కావ‌డంతో ప్ర‌‌ణీత ఆశించిన స్థాయిలో పాపుల‌ర్ కాలేక‌పోయింది.

‌తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల్లో న‌టిస్తూ క‌మ‌ర్షియ‌ల్ క‌థానాయిక‌గా మంచి గుర్తింపుని తెచ్చుకోవాల‌ని ప్ర‌య‌త్నించి ఓ విధంగా విఫ‌ల‌మైంద‌ని చెప్పాలి. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌లో రామ‌ణ అవ‌తార‌,..హిందీలో భుజ్ : ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, హంగామా 2 వంటి చిత్రాల్లో న‌టిస్తోంది. షూటింగ్‌ ల నుంచి కాస్త విరామం ల‌భించ‌డంతో వెకేష‌న్ కోసం విదేశాల్లో విహ‌రిస్తోంది.

తాజాగా ఇన్ స్టాలో ఓ వీడియోతో పాటు కొన్ని ఫొటోల‌ని షేర్ చేసింది. మంచు కొండ‌ల్లో వున్న ఓ మిర్ర‌ర్ హౌస్‌ లో బేబీ డాల్‌ లా మారి మంచు కురుస్తున్న వేళ అహ్ల‌ద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని ఎంజాయ్ చేస్తోంది. వింట‌ర్ వేళ మంచుఏ కొండ‌ల్లో భారీ వృక్షాల మ‌ధ్య వున్న మిర్ర‌ర్ హౌస్ ‌లో బేబీడాల్‌ గా ప్ర‌ణీత విహ‌రిస్తున్న వీడియో ప్ర‌స్తుతం ఇంర్నెట్‌ లో సంద‌డి చేస్తోంది.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.instagram.com/reel/CIyA4zNA2At/?igshid=ghb3umlmksy2