Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోయిన్స్‌ ఈమెను చూసి నేర్చుకోవాలి

By:  Tupaki Desk   |   26 April 2020 7:50 AM GMT
స్టార్‌ హీరోయిన్స్‌ ఈమెను చూసి నేర్చుకోవాలి
X
ఒక్కో సినిమాకు కోట్లు డిమాండ్‌ చేస్తూ.. అదనపు డేట్లు ఇవ్వాలంటే మరింతగా డిమాండ్‌ చేస్తూ పబ్లిసిటీకి వచ్చిన సమయంలో ఔట్‌ డోర్‌ షూటింగ్‌ సమయంలో అదనపు చార్జీలు వసూళ్లు చేస్తూ ఉండే స్టార్‌ హీరోయిన్స్‌ ఎవరు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. కరోనా విపత్తు సమయంలో పలువురు సినీ సెలబ్రెటీలు తమవంతు సాయంను అందించేందుకు ముందుకు వస్తుండగా అందులో హీరోయిన్స్‌ శాతం చాలా చాలా తక్కువ అని చెప్పాలి.

హీరోలతో సమానంగా పారితోషికంను డిమాండ్‌ చేసే ముద్దుగుమ్మలు ఇప్పుడు మాత్రం హీరోల స్థాయిలో దాతృత్వంను చాటుకోవడం లేదు. ఒక్కరు ఇద్దరు మినహా హీరోయిన్స్‌ ఎవరు కూడా పెద్దగా సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. కాని పెద్దగా క్రేజ్‌ లేని.. కోట్లల్లో పారితోషికాలు అందుకోని.. అసలు ఈమద్య కాలంలో సినిమా ఆఫర్లే లేని ప్రణీత మాత్రం మంచి మనసు చాటుకుని వందలాది మంది పేదవారి ఆకలి తీర్చుతూ స్టార్‌ హీరోయిన్స్‌ తలదించుకునేలా చేస్తోంది.

తెలుగులో చాలా సినిమాల్లో నటించినా కూడా స్టార్‌ డంను మాత్రం దక్కించుకోలేక పోయిన ప్రణీత ఈ మద్య పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. కరోనా బాధితుల కోసం తెలుగు సినిమా పరిశ్రమ నుండి హీరోయిన్స్‌ లో మొదటి విరాళంను ప్రకటించిన ప్రణీత ఇప్పుడు తన ఇంటి చుట్టు పట్టున ఉండే వారు.. ఆకలితో అలమటించే వారి కోసం స్వయంగా వంట చేసి వారి ఆకలి తీర్చుతోంది. ఆమె చేస్తున్న పనిని నిజంగా అభినందించకుండా ఉండలేం. క్వారెంటైన్‌ టైం అంటూ పిచ్చి పిచ్చి ఛాలెంజ్‌ లు చేస్తూ టైం పాస్‌ చేస్తున్న హీరోయిన్స్‌ ఈమెను చూసి నేర్చుకోవాలంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.