Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్‌ ప్రెగ్నెంట్‌.. సాక్ష్యం కూడా చూపించింది

By:  Tupaki Desk   |   11 April 2022 10:31 AM GMT
ఆ హీరోయిన్‌ ప్రెగ్నెంట్‌.. సాక్ష్యం కూడా చూపించింది
X
అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్‌ హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ ప్రణీత ను తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మర్చి పోరు. అంతకు మందు.. ఆ తర్వాత ఆమె చాలా సినిమాలు చేసింది. అయితే ఆమెకు హీరోయిన్ గా స్టార్‌ డమ్‌ మాత్రం దక్కలేరు. హీరోయిన్ గా ఆమె నటించిన సినిమాలు సక్సెస్‌ అయ్యి స్టార్‌ డమ్‌ రాకపోయినా కూడా ఆమె మంచి మనసుతో గుర్తింపు దక్కించుకుంది.

హీరోయిన్‌ గా ఆఫర్లు తగ్గిన సమయంలో సోషల్‌ మీడియాలో ప్రణీత సుభాష్ బిజీ అయ్యింది. తన అందమైన ఫోటోలను షేర్ చేయడం మొదలుకుని ఎన్నో ఫోటోలు మరియు వీడియోలను షేర్‌ చేయడం తో పాటు సమాజంకు ఉపయోగ పడే పలు విషయాలను కూడా ఆమె షేర్‌ చేస్తూ వచ్చింది. ఈమద్య కాలంలో ఆమె కరోనా వల్ల ఇబ్బంది పడ్డ వారికి కూడా సాయం చేసింది.

వలస కూలీలకు మరియు ఇంకా రోడ్డు మీద అడుక్కునే వారికి ఇలా ఎంతో మందికి తనవంతు సాయం చేయడం ద్వారా మంచి మనసు నిరూపించుకుంది. ప్రణీతకు పెళ్లి అయిన విషయం ఇండస్ట్రీలో మరియు మీడియా సర్కిల్స్‌ లో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆమె పెళ్లి గురించి ఇన్నాళ్లు పెద్దగా చర్చ జరగలేదు. భర్తను కూడా ఆమె ఎప్పుడు చూపించింది లేదు.

జనాలకు అసలు ప్రణీత పెళ్లి గురించి ఎప్పుడు కూడా ఆలోచనే రాలేదు. కాని అనూహ్యంగా ప్రణీత తల్లి కాబోతున్నట్లుగా ప్రకటించడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు. కేవలం తల్లి కాబోతున్నట్లుగా ప్రకటించకుండా తన భర్త ను మరియు తాను తల్లి కాబోతున్నట్లుగా నిర్థారణ అయిన స్కాన్ రిపోర్ట్‌ ను కూడా ఆమె షేర్‌ చేసి అందరికి షాక్ ఇచ్చింది అనడంలో సందేహం లేదు.

ప్రణీత తల్లి కాబోతున్నట్లుగా సింపుల్ గా చెప్పి ఉంటే ఖచ్చితంగా రకరకాలుగా ప్రచారం జరిగేది. కాని ఆమె తన స్కాన్ రిపోర్ట్‌ ను మరియు భర్తను కూడా షేర్‌ చేయడం ద్వారా చాలా వరకు నెగిటివిటీ తగ్గింది.

అయితే ఆమె ఈ సందర్బంగా షేర్‌ చేసిన పోటోలు కాస్త ఎబ్బెట్టుగా ఉన్నాయంటూ నెటిజన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆనందంలో ఉన్న జంట ఇంతకు మించి తమ ఆనందంను ఎలా చూపిస్తారు అనేది ప్రణీత అభిమానుల అభిప్రాయం.