Begin typing your search above and press return to search.

పవన్, మహేష్‌ లతో నటించినా కూడా

By:  Tupaki Desk   |   8 Sept 2016 11:10 AM IST
పవన్, మహేష్‌ లతో నటించినా కూడా
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేదితో.. కన్నడ బ్యూటీ ప్రణీతను బాపు బొమ్మగా మార్చేశాడు దర్శకుడు త్రివిక్రమ్. ఈ మూవీలో కొన్ని చోట్ల సమంతను కూడా డామినేట్ చేసేసే కేరక్టర్ చేసిన ప్రణీతకు.. ఆ తర్వాత ఆఫర్లు క్యూ కట్టేశాయి. అయితే.. కన్నడ.. తమిళ్.. తెలుగు సినిమా ఆఫర్లను బ్యాలెన్స్ చేసుకోవడం అమ్మడికి చేతకాలేదు. దీంతో తనకు అనుకోకుండా కలిసొచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోలేకపోయింది.

ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నట్లుగా ఉన్న ప్రణీతా సుభాష్.. కొత్త రూట్ లో నరుక్కొచ్చేందుకు ట్రై చేస్తోంది. బాపు బొమ్మగా చక్కని కట్టుబొట్టుతో కనిపించిన ఈ భామ.. ఇప్పుడు గ్లామర్ డోస్ తో పిచ్చెక్కించేస్తా అన్నట్లుగా తయారైపోయింది. క్లీవేజ్ షో చేస్తూ.. పొట్టి పొట్టి డ్రస్సులతో ఫోటో సెషన్ కూడా చేయించేసుకుంది. ఏ మాటకు ఆమాటే చెప్పుకోవాలి కానీ.. అమ్మడి స్కిన్ టోన్ ను అదరహో అనాల్సిందే. అయితే.. పవన్-మహేష్ ల మూవీల్లో నటించినా కూడా క్రేజ్ రాకపోవడానికి కారణం మాత్రం.. చేజేతులా చేసుకున్న తప్పిదాలే.

మరి ఇప్పుడు గ్లామర్ షోకి సిద్ధమంటూ సిగ్నల్స్ పంపిన తర్వాతైనా.. ఈ బాపు బొమ్మకు మన దర్శక నిర్మాతలు ఆఫర్లు ఇస్తారో లేదో? ఈ కన్నడ బొమ్మకు వచ్చిన కష్టాలు తీరతాయో లేదో?