Begin typing your search above and press return to search.

ప్ర‌ణీత ఇంకా మ‌హేష్‌ ని క‌ల‌వ‌లే

By:  Tupaki Desk   |   17 Oct 2015 11:30 AM GMT
ప్ర‌ణీత ఇంకా మ‌హేష్‌ ని క‌ల‌వ‌లే
X
చేప‌క‌ళ్ల ప్ర‌ణీత ఇటీవ‌లి కాలంలో తెలుగు - త‌మిళ్‌ - క‌న్న‌డ‌లో ఫుల్ బిజీ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ స‌ర‌స‌న బ్ర‌హ్మోత్స‌వం చిత్రంలో అవ‌కాశం అందుకుంది. ఈ చిత్రంలో స‌మంత‌ - కాజ‌ల్ వంటి క్రేజీ హీరోయిన్స్ న‌టిస్తున్నా .. త‌న‌కంటూ ఓ స‌ప‌రేట్ రోల్ ఉంద‌ని చెప్పుకొచ్చింది అమ్మ‌డు. నా కెరీర్‌ లో నేను చేస్తున్న‌వి గెస్ట్ రోల్స్‌ లాంటివే అయినా ప్ర‌తిదీ ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేకుండా డిఫ‌రెంట్‌ గా చేస్తున్నాన‌ని చెప్పుకొచ్చింది.

సూర్య స‌ర‌స‌న మాస్ సినిమాలో నేను చెప్పింది రెండు డైలాగులే అయినా నా క్యారెక్ట‌ర్ మాంటేజెస్‌ లో అదిరిపోయేలా చూపించారు. అలాగే విష్ణు డైన‌మైట్‌ లోనూ నా క్యారెక్ట‌ర్ డిఫ‌రెంట్ . ఈ చిత్రంలో ఏకంగా స్టంట్స్ చేసేశాను. ఇప్పుడు బ్ర‌హ్మోత్స‌వం చిత్రంలో అంతే డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌ లో చేస్తున్నా.. అని చెప్పింది. అస‌లింత‌కీ ప్ర‌ణీత మ‌హేష్‌ తో సీన్స్‌ లో న‌టించిందా? అంటే ఈ అమ్మ‌డు చెప్పిన దాని ప్ర‌కారం లేనేలేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే బ్ర‌హ్మోత్స‌వం షూటింగులో కీల‌క న‌టీన‌టుల‌తో క‌లిసి కొన్ని సీన్స్ తెర‌కెక్కించారు. వాటిలో నేను కూడా ఉన్నా.. అని చెప్పింది.

ప్రిన్స్ మ‌హేష్ సినిమాలో న‌టించే ఛాన్స్ రావ‌డం అంటేనే ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా ఉంద‌ని చెప్పింది. బ్ర‌హ్మోత్స‌వంలో త‌న క్యా,రెక్ట‌ర్ ఏంటో ఇప్పుడే చెప్ప‌డం ఎర్లీ అనిపించుకుంటుంది. అందుకే కాస్త వెయిటింగ్‌ లో ఉన్నా అని చెప్పింది. అస‌లింత‌కీ మ‌హేష్‌ తో సీన్స్ ఉన్నాయా? లేవా? ఉంటే ఎలాంటివి? అన్న‌ది మాత్రం చెప్ప‌నేలేదింకా.