Begin typing your search above and press return to search.

ముఖానికి సూదులు గుచ్చుకున్న ప్రణీత.. ఫొటో వైరల్!

By:  Tupaki Desk   |   7 Jan 2021 3:30 PM GMT
ముఖానికి సూదులు గుచ్చుకున్న ప్రణీత.. ఫొటో వైరల్!
X
చారెడేసి కళ్లతో సొగసైన స్మైల్ తో కట్టిపడేసే రూపం హీరోయిన్ ప్రణీత శుభాష్ సొంతం. 'ఏం పిల్లో ఏం పిల్లాడో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. అయితే.. ఆ తర్వాత రెండు సినిమాలు చేసినా.. అవి ప్రేక్షకులను అలరించలేక పోయాయి. ఆ తర్వాత కాస్త గ్యాప్ తో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన చోటు దక్కించుకుంది.

'అత్తారింటికి దారేది' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్న ప్రణీత.. తన అందం, అభినయంతో అందరినీ అలరించింది. ఆ సినిమా తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ తో 'హలో గురూ ప్రేమ కోసమే' అనే సినిమా చేసింది. ఇందులో మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ అమ్మడు.

కాగా.. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల కొన్ని రోజుల క్రితం మాల్దీవుల్లో విహారానికి వెళ్లి.. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. లేటెస్ట్ గా ప్రణీత పోస్ట్ చేసిన ఒక ఫొటో తెగ వైరల్ అవుతోంది. అందమైన తన ముఖానికి సూదులు గుచ్చి ఉన్న ఫొటోని షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అయితే.. ఇందులో ఆందోళనపడాల్సింది ఏమీ లేదు. ఇది ఒక రకమైన వైద్య విధానం. నేచురోపతి మాదిరిగా.. ఆక్యుపంక్చర్ వైద్య చికిత్సలో ఇది ఒక భాగం. సూదులు గుచ్చి శరీరంలోని నొప్పులను నయం చేస్తారు. ఇది చైనాలోని పురాతన వైద్య విధానం. ఇప్పుడు ప్ర‌ణీత కూడా ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నట్టు త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ ఫొటో చూసిన అభిమానులు.. 'గెట్ వెల్ సూన్' అని కామెంట్ చేస్తున్నారు.