Begin typing your search above and press return to search.

కమల్‌ అండ్‌ టీమ్‌ రోజంతా..!

By:  Tupaki Desk   |   25 May 2015 3:00 PM IST
కమల్‌ అండ్‌ టీమ్‌ రోజంతా..!
X
ఆ ఇద్దరూ బాలచందర్‌ శిష్యులు. మేటి నటులుగా నిరూపించుకొన్నారు. వాళ్లకు సినిమా తప్ప మరో ధ్యాస ఉండదంటే నమ్మండి. సినిమాపై వీళ్లకు ఎంత ప్రేమంటే రోజంతా దాని గురించే మాట్లాడమన్నా ఓకే అంటారు. ఆ ఇద్దరు ఎవరో కాదు... కమల్‌, ప్రకాష్‌రాజ్‌. 'చీకటిరాజ్యం' సినిమాకోసం మరోసారి వీళ్లు కలిసి పనిచేస్తున్నారు. ఆదివారమే సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. పనిలోపనిగా ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు. మామూలుగా సినిమాకి సంబంధించిన ప్రెస్‌మీట్‌ పూర్తవ్వగానే ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోతుంటారు. కొన్నిసార్లు ప్రెస్‌మీట్‌కి కూడా మొక్కుబడిగానే హాజరవుతుంటారు. కానీ కమల్‌ అండ్‌ టీమ్‌ మాత్రం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌కి హాజరై, ఆ తర్వాత అందరూ ఒకచోట సమావేశమయ్యారు. కథానాయిక, దర్శకుడు, మాటల రచయిత, ఆర్ట్‌ డైరెక్టర్‌... ఇలా అందరూ కలిసి స్క్రిప్టు గురించి చర్చించుకొన్నారట. రోజంతా అదే పనిలోనే నిమగ్నమయ్యారట. సినిమాలోని పాత్రల గురించి, నటన గురించి ఒకరికొకరు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చుకొన్నారట. ఒక సినిమాకోసం సన్నద్ధమవ్వడం అంటే ఎలాగో కమల్‌ స్వయంగా చూపించారట. ఆ హోమ్‌వర్క్‌ గురించి చిత్రబృందం పదే పదే చెప్పుకొంటోంది. ప్రకాష్‌రాజ్‌ కూడా వండర్‌ఫుల్‌ డే... అంటూ ట్వీట్‌ చేశాడు.