Begin typing your search above and press return to search.
ప్రకాష్ తో మహేష్-నువ్వా నేనా?
By: Tupaki Desk | 28 Jan 2018 11:46 AM ISTమహేష్ బాబు మాస్ ఇమేజ్ ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళిన సినిమాల్లో ఒక్కడు మొదటి స్థానంలో ఉంటుంది. అందులో హీరోగా మహేష్ కు ఎంత పేరు వచ్చిందో విలన్ గా చేసిన ప్రకాష్ రాజ్ కూడా అంతే పేరు తీసుకున్నాడు. కొండారెడ్డి బురుజు దగ్గర కొట్టుకునే సీన్ దగ్గర మొదలైన ఈ ఇద్దరి శత్రుత్వం ఆ తర్వాత పోకిరితో పీక్స్ లోకి వెళ్లిపోయింది. బాబీ - సైనికుడు - అర్జున్ లాంటి సినిమాల్లో ప్రకాష్ రాజ్ నటించాడు కాని అన్నిటిలోనూ విలన్ పాత్రలే పోషించాడు. ఒక్క సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో మాత్రం ప్రిన్స్ తండ్రిగా మంచితనానికి ప్రతిరూపమైన సాఫ్ట్ రోల్ లో నటించాడు. శ్రీమంతుడు మొదలుకొని స్పైడర్ దాకా మధ్యలో మహేష్ సినిమాల్లో ప్రకాష్ రాజ్ లేడు. మళ్ళి ఇప్పుడు భరత్ అనే నేనులో ఈ కాంబో రిపీట్ అవుతోంది.
చిన్న వయసులోనే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా మారిన హీరో పాత్ర చేస్తున్న మహేష్ కు ధీటుగా ప్రకాష్ రాజ్ ఇందులో ప్రతిపక్ష నాయకుడి పాత్ర చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. పొలిటికల్ పంచులతో ఇద్దరి మధ్య సీన్స్ ని దర్శకుడు కొరటాల శివ ఓ రేంజ్ లో తీస్తున్నట్టు టాక్ వస్తోంది. ప్రకాష్ రాజ్ పాత్ర వేసే ఎత్తులకు - కుట్రలకు మహేష్ తనదైన స్టైల్ లో తిప్పి కొట్టి ఎపిసోడ్స్ థ్రిల్ చేయటం ఖాయం అంటున్నారు. మహేష్ బాబు సినిమాల్లో మెయిన్ విలన్ గా ప్రకాష్ రాజ్ చేసిన పాత్రలన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఫ్లాప్ అయిన వాటిని గమనిస్తే వాటిలో మరో విలన్ కూడా ఉంటాడు. సో సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అవుతుంది అని ఫాన్స్ నమ్ముతున్నారు.
భరత్ అనే నేను ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఓత్ రిలీజ్ చేసాక మహేష్ ఫాన్స్ లో ఉత్సాహం వచ్చింది. రెగ్యులర్ గా చేసే పాత్ర కాకుండా అల్ట్రా స్టైలిష్ గా ఇలాంటి పాత్రల్లో ప్రిన్స్ ని చూడాలని ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం కీలకమైన షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న భరత్ అనే నేను ఏప్రిల్ విడుదలకు టార్గెట్ పెట్టుకున్నారు. కాని డేట్ విషయంలో మాత్రం కొంత సందిగ్దత నెలకొంది. మరో నెల రోజుల్లో దాని గురించి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కైరా అద్వాని టాలీవుడ్ కు ఈ సినిమా ద్వారానే పరిచయమవుతోంది.