Begin typing your search above and press return to search.

కనీసం ఇప్పుడైనా ఆలోచించండి

By:  Tupaki Desk   |   23 Nov 2017 11:44 AM IST
కనీసం ఇప్పుడైనా ఆలోచించండి
X
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్యకాలంలో రాజకీయాలపై ఏ స్థాయిలో స్పందిస్తున్నారో తెలిసిందే. ముఖ్యంగా కేద్ర ప్రభుత్వంపై ఆయన వేస్తోన్న సెటైర్స్ అలాగే జస్ట్ అస్కింగ్ అనే కామెంట్స్ చాలా వరకు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రకాష్ రాజ్ కామెంట్స్ పై మాత్రం బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతే కాకుండా గట్టిగా వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. ఇక రీసెంట్ గా ప్రకాష్ రాజ్ మరోసారి తన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు.

రీసెంట్ గా కోలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ అప్పుల వాళ్ల వేధింపులు తట్టుకోలేక మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. సినిమా ఇండస్ట్రీ లకు కూడా ప్రభుత్వాలు రక్షణగా ఉండాలని చెప్పారు. అంతే కాకుండా పన్నుల విషయంలో ఒకసారి సినీ ప్రముఖులతో చర్చలు జరిపితే బావుంటుందని వివరించారు. నిర్మాతలు అప్పులు కట్టలేక సతమతమవుతున్నారని ఒకసారి ఈ విషయంపై ఆలోచిస్తే మంచిదని తెలిపారు.

ఇక అశోక్ కుమార్ చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్ కూడా కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం గురించి కూడా ప్రకాష్ రాజ్ స్పందించారు. అతను చనిపోయే ముందు తెలిపిన వివరాలు చాలా ముఖ్యమని ప్రభుత్వం దీని గురించి ఆలోచించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇతను ఇంతకుముందు కూడా ఆ అంశాలను ప్రస్తావించినా ఎవరు పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా మానవత్వ విలువలతో అలోచించాలని ప్రకాష్ రాజ్ తెలియజేశారు.