Begin typing your search above and press return to search.
మేం నీతోనే ఉన్నాం. సాయిపల్లవికి అండగా నిలిచిన ప్రకాష్ రాజ్
By: Tupaki Desk | 19 Jun 2022 3:00 PM IST'విరాటపర్వం' మూవీ ప్రమోషన్ లో భాగంగా సాాయిపల్లవి చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. ది కశ్మీర్ ఫైల్స్, కశ్మీర్ పండిట్ల హత్యలకు గో హత్యలకు లింక్ చేస్తూ నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయిపల్లవి చేసిన కామెంట్స్ పై హిందూ సంఘాలు, భజరంగ్ దల్ నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే ఆమె నటించిన సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టారు.
తాజాగా సాయిపల్లవికి నటుడు ప్రకాష్ రాజ్ నిలిచారు. హ్యుమానిటీ అన్నింటికంటే ముందు అని.. సాయిపల్లవి మేము నీతోనే ఉన్నామంటూ ఆయన మద్దతు ఇచ్చారు. సాయి పల్లవి ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ప్రకాష్ రాజ్ పోస్ట్ పెట్టారు. అయితే నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ప్రకాష్ రాజ్ అండగా నిలవడం మంచిదేనని అంటుండగా.. మరికొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
మరోవైపు ఈ వివాదంపై సాయిపల్లవి కూడా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాను మాట్లాడిన చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారని క్షమాపణలు చెప్పింది. తనను రైటా? లెఫ్టా? అని అడిగితే తాను ఏది కాదు న్యూట్రల్ అని చెప్పానని తెలిపింది. హింస అనేది ఏ రూపంలో ఉన్నా కూడా తప్పే.. మతాల పేరిట చేసే హింస మహాపాపం అని చెప్పాలని అనుకున్నానని పేర్కొంది. ఇదే తన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం అని.. కానీ కొందరు మూకదాడిని సమర్థిస్తున్నారని చెప్పింది. ఒక డాక్టర్ గా తనకు ఓ ప్రాణం విలువ తెలుసు అని.. అందరి ప్రాణాలు ఒక్కటేనంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.