Begin typing your search above and press return to search.

కరోనా మార్పునకు సినీ పరిశ్రమ సిద్ధంగా ఉండాలి!

By:  Tupaki Desk   |   24 April 2020 1:40 PM IST
కరోనా మార్పునకు సినీ పరిశ్రమ సిద్ధంగా ఉండాలి!
X
కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై తీవ్రంగా ఉంటుందని.. ఈ సంక్షోభం మరో రెండేళ్లు చిత్రపరిశ్రమపై ఉంటుందని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ఇలాంటి తరుణంలో హీరోలు, సినీ పరిశ్రమ అంతా కలిసి ఈ సినీ పరిశ్రమపై ఆధారపడిన ఆర్ట్, మేకప్, లైంటింగ్ విభాగంలోని వేతన కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ప్రకాష్ రాజ్ ఉన్నారు.

తమిళనాట సినీ కార్మికుల ఎన్నికలను కూడా రద్దు చేయమని అన్నానని.. రోజువారీ కార్మికులను ఆదుకోవాలని సూచించానని ప్రకాష్ రాజ్ అన్నారు. ఈ సమయంలో హీరోలు సినీ పరిశ్రమ మొత్తం సినీ కార్మికులను ఆదుకోవాలన్నారు.

ప్యాన్ ఇండియా, భారీ బడ్జెట్ సినిమాల విషయంలో మరోసారి దర్శక నిర్మాతలు పరిస్థితులను బట్టి మారాలని.. లేకపోతే వారే కష్టాలకు గురి అవుతారన్నారు.ప్రకృతికి ఎవరూ విరుద్ధంగా వెళ్లకూడదని.. ఎవరైనా అలా వెళితే గుణపాఠం నేర్పుతుందని తెలిపారు. వైరస్ లకు కులం - మతం - ధనిక - పేద సెలెబ్రెటీ అన్న తేడా ఉండదని సినీ పరిశ్రమకు ప్రకాష్ రాజ్ హితవు పలికారు.

తెలుగు సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి సహా స్టార్ హీరోలు ముందుకు రావడం అభినందనీయమని ప్రకాష్ రాజ్ అన్నారు. లాక్ డౌన్ తర్వాత పరిస్థితి ఏమటన్నది ఆలోచించి భవిష్యత్ లో రానున్న 6 నెలల్లో ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టాలని ప్రకాష్ రాజ్ సూచించారు. ఇక పారితోషకం విషయంలో కూడా మన స్టార్లు పునరాలోచించుకోవాలని. పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే కష్టాలు తప్పవని ప్రకాష్ రాజ్ హెచ్చరించారు.