Begin typing your search above and press return to search.
పవన్ మార్నింగ్ షో కలెక్షన్ అంత ఉండదు మీ సినిమా బడ్జెట్: ప్రకాశ్ రాజ్
By: Tupaki Desk | 1 Oct 2021 10:00 PM ISTతెలుగు చిత్ర పరిశ్రమలో 'మా' అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బరిలో దిగుతున్న రెండు ప్యానల్స్ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. నామినేషన్ ఘట్టం పూర్తై ఎన్నిక గడువు దగ్గర దగ్గర పడుతుండటంతో.. అభ్యర్థుల మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరుగుతోంది. పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టి.. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ సార్వత్రిక ఎన్నికల వాతావరణం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా ప్రకాష్ రాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక అంశాలపై మాట్లాడారు.
'మీరు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారా? లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా?' అని మంచు విష్ణు ప్రశ్నించడం బాగోలేదని.. పవన్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా? అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ''పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని విశ్లేషించాలి. మొదట ఆయన సినీ నటుడు.. ఆ తర్వాతే రాజకీయ నాయకుడు. విష్ణు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. పవన్ మార్నింగ్ షో కలెక్షన్ అంత లేదు మీ సినిమా బడ్జెట్. ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి'' అని ప్రకాష్ రాజ్ అన్నారు.
''మీకు పొలిటికల్ అజెండా ఉంటే మీరు చూసుకోండి. పవన్ కళ్యాణ్ ఓ నటుడు. ఆయన రాజకీయ అజెండా మాకొద్దు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నాకు తెలియవు. ఇండస్ట్రీ పరంగా పవన్ రెండు మూడు ప్రశ్నలు అడిగారు. అవి ఏ స్వరంతో అడిగారనే దానిపై మనం చర్చించుకుందాం. అంతేకానీ.. మీరు పవన్ కల్యాణ్ పక్కన ఉన్నారా? ఇండస్ట్రీ పక్కన ఉన్నారా?’ అంటూ నన్నెందుకు లాగుతున్నారు. ఆయనకు నాకూ సిద్ధాంత పరంగా విభేదాలు ఉన్నాయి. పవన్ కూడా ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. కానీ సినిమా విషయానికొస్తే నేను నంద - ఆయన బద్రి. అంతే'' అని చెప్పారు.
'మా' ఎన్నికల్లోకి జగన్ ను లాగొద్దని.. ఆయన పాదయాత్ర చేసి ప్రజల మనసు గెలుచుకుని ముఖ్యమంత్రి అయ్యారని.. 'మా' అసోసియేషన్ గురించి ఆలోచించేంత సమయం ఆయనకు ఉండదని ప్రకాష్ రాజ్ అన్నారు. అలానే కేసీఆర్ ఉద్యమం చేసి సీఎం అయ్యారని.. ఆయనకు చాలా పనులున్నాయని.. ఇందులోకి వాళ్ల పేర్లు ఎందుకు లాగుతున్నారని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.
ప్రకాష్ రాజ్ కు పూనమ్ కౌర్ మద్దతు:
'మా' అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ కు సినీ నటి పూనమ్ కౌర్ మద్దతు ప్రకటించింది. ''ప్రకాష్ రాజ్ సార్ 'మా' ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నాను. అదే జరిగితే చాలా కాలం నుంచి నిశబ్దంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రకాష్ రాజ్ కు తెలియజేస్తాను. అతను మాత్రమే నిజాయితీగా ఉంటాడు. చిల్లర రాజకీయాలు చేయకుండా.. పెద్దల పట్ల గౌరవాన్ని కలిగియుండి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. జైహింద్'' అని పూనమ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.