Begin typing your search above and press return to search.

మరోసారి పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్.. ఎందుకిలా అంటే?

By:  Tupaki Desk   |   25 Aug 2021 3:31 AM GMT
మరోసారి పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్.. ఎందుకిలా అంటే?
X
సామాన్యుల కుటుంబాల్లో కనిపించని కొన్ని సిత్రాలు సెలబ్రిటీల ఇళ్లల్లో తరచూ జరుగుతుంటాయి. ఇంట్లో పిల్లల కోరిక కోసం తల్లిదండ్రులు మళ్లీ పెళ్లి చేసుకుంటారా? ఒకవేళ వారు అలాంటి కోరిక కోరితే.. నవ్వి ఊరుకుంటారు. లేదంటే.. కాస్త పెద్దవాళ్లు అవ్వండి.. మీరే దగ్గరుండి షష్టిపూర్తి చేయండని చెబుతారు. అందుకు భిన్నంగా పిల్లాడు అడిగాడని మళ్లీ పెళ్లి చేసుకోవటం.. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. మొన్నామధ్యనే ప్రేమ పెళ్లి చేసుకున్నారు కదా? అన్న సందేహం రాక మానదు. అయితే.. అప్పట్లో పెళ్లాడిన పోనీవర్మనే ఆయన మళ్లీ మరోసారి పెళ్లాడారు. తామిద్దరం పెళ్లి చేసుకొని పదకొండేళ్లు కావటంతో పెళ్లి యానివర్సిరీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తన కొడుకు వేదాంత్ తన ముందు పెళ్లి చేసుకోవాలని కోరిక కోరటంతో.. తామిద్దరం మరోసారి పెళ్లి చేసుకున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా భార్య.. పిల్లలతో కలిసి తాను దిగిన ఫోటోల్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం పలు భాషా చిత్రాల్లో బిజీబిజీగా ఉన్నఆయన ఈ మధ్యనే తమిళ సినిమా షూటింగ్ లో గాయపడటం.. హైదరాబాద్ లోని సన్ షైన్ ఆసుపత్రిలో చేరటం తెలిసిందే. తన స్నేహితుడు డాక్టర్ గురువారెడ్డి సేఫ్ హ్యాండ్ లోకి వెళ్లనున్నట్లు చెప్పి.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోకి చేరుకున్న ఆయన. .ఈ మధ్యనే డిశ్చార్జి అయ్యారు.

తన పెళ్లి రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకను ఘనంగా జరుపుకున్నారు. గాయం తాలూకు ఇబ్బంది బాగానే ప్రకాశ్ రాజ్ అధిగమించినట్లుగా కనిపిస్తోంది. వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న వైనం.. తాజాగా కిస్సింగ్ సీన్ చూస్తే.. ఇట్టే అర్థమైపోతుంది. ఈ మధ్యనే ‘మా’ అసోసియేషన్ అధ్యక్ష స్థానానికి తాను పోటీ చేయనున్నట్లుగా చెప్పిన ప్రకాశ్ రాజ్ విపరీతంగా అందరిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. దేని దారి దానిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్న ప్రకాశ్ రాజ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారని చెప్పాలి.