Begin typing your search above and press return to search.

కృష్ణ‌వంశీ రంగ‌మార్తాండ ఇడుగో

By:  Tupaki Desk   |   6 Jan 2022 2:30 PM GMT
కృష్ణ‌వంశీ రంగ‌మార్తాండ ఇడుగో
X
టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీకి ప్ర‌త్యేక‌మైన పేరున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న నుంచి సినిమా అంటే ఏదో ఒక ప్ర‌త్యేక‌త ఖ‌చ్చితంగా వుంటుంద‌నే బ్రాండ్ ప‌డిపోయింది. అయితే ఆ బ్రాండ్ కి త‌గ్గ‌ట్టుగా ఈ మ‌ధ్య ఆయ‌న నుంచి సినిమాలు రావ‌డం లేదు. `మ‌హాత్మ‌` త‌రువాత ఆయ‌న హిట్టు అనే మాట విని చాలా కాల‌మే అవుతోంది. `న‌క్ష‌త్రం` డిజాస్ట‌ర్ గా మిగ‌ల‌డంతో కొంత కాలం డైరెక్ష‌న్ కి దూరంగా వున్న ఆయ‌న మ‌రాఠీ రీమేక్ తో రాబోతున్నారు.

దాదాపు నాలుగేళ్ల విరామం త‌రువాత కృష్ణ‌వంశీ చేస్తున్న చిత్రం `రంగ మార్తాండ‌`. మ‌రాఠీలో విజ‌య‌వంత‌మైన `న‌ట‌స‌మ్రాట్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. మ‌రాఠీలో టైటిల్ పాత్ర‌ని వెర్స‌టైల్ ఆర్టిస్ట్ నానా ప‌టేక‌ర్ పోషించారు. ఈ పాత్ర‌కు ప్ర‌శంస‌లు ల‌భించాయి. అదే పాత్రని తెలుగులో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ పోషిస్తున్నారు. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో బ్ర‌హ్మానందం నెవ‌ర్ బిఫోర్ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ అనే స్థాయి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

ఇటీవ‌ల ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన ఆన్ లొకేష‌న్ స్టిల్ ని ద‌ర్శ‌కుడు షేర్ చేసి అభిమానుల‌తో పంచుకున్నారు. బ్ర‌హ్మానందంతో పాటు ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, అన‌సూయ‌, అలీ రెజా, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, రాహుల్ సిప్లిగంజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కోవిడ్ కార‌ణంగా షూటింగ్ ఆల‌స్యం అవుతూ వ‌స్తున్న ఈ మూవీ స‌మ్మ‌ర్ కే వ‌చ్చే అవ‌కాశాలు వున్న‌ట్టుగా చెబుతున్నారు.

ఇదిలా వుంటే ఇంత వ‌ర‌కు `రంగ మార్తాండ‌` పాత్ర‌లో న‌టిస్తున్న ప్ర‌కాష్ రాజ్ పాత్ర‌కు సంబంధించిన లుక్ ని రిలీల్ చేయ‌ని కృష్ణ వంశీ గురువారం సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌కాష్ రాజ్ లుక్ ని పోస్ట్ చేశారు. మానిట‌ర్ ముందు కూర్చుని షాట్ కు రెడీ అవుతున్న `రంగ మార్తాండ‌` గెట‌ప్ ఆక‌ట్టుకుంటోంది. త‌ల‌పాగా.. కుర్తాపై బ్లాక్ స్వెట‌ర్ ధ‌రించి తీక్ష‌ణంగా చూస్తున్న ప్ర‌కాష్ రాజ్ లుక్ ఆస‌క్తిక‌రంగా వుంది. తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా ప్ర‌కాష్ రాజ్ మేకోవ‌ర్‌ని మార్చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట సంద‌డి చేస్తోంది.