Begin typing your search above and press return to search.

అప్పు చేసైనా సాయం చేస్తానంటున్న స్టార్ నటుడు

By:  Tupaki Desk   |   21 April 2020 6:30 PM IST
అప్పు చేసైనా సాయం చేస్తానంటున్న స్టార్ నటుడు
X
ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.. కరోనా వైరస్ ని సమర్థవంతంగా కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో 19 రోజులపాటు లాక్ డౌన్ పొడిగించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తినడానికి తిండి లేక చాలా మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పేదలకు అండగా నిలుస్తానని, తనకు ఎంత కష్టమొచ్చినా సేవ చేయడానికి ముందుంటానని సినీనటుడు ప్రకాష్ రాజ్ వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. "నా ఆర్థిక వనరులు క్షీణిస్తున్నాయి. అయినా సరే అప్పు తీసుకొని అయినా ఈ కష్టకాలంలో నాకు సాధ్యమైనంత సాయం అందిస్తాను. భవిష్యత్‌లో మళ్లీ సంపాదించుకోగలనని నాకు తెలుసు. ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చూపించాల్సిన సమయమిది. మనమంతా కలిసి కరోనాపై పోరాడదాం. జీవితాలను నిలబెడదాం" అంటూ ట్వీట్ చేశారు.

ఈ సంద్భంగా ప్రకాష్ రాజ్ నా శక్తి మేరకు నేను సాయం చేస్తాను. మీరు కూడా మీ పక్కన ఉన్నవాళ్ళని చూడండి. వారికి మీ తోచిన సహాయం అందించండి. ఒకరి జీవనాన్ని జీవితాన్ని మీరు నిలిపే సమయం ఇది అంటూ ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ చేసీన ఈ ట్వీట్ కి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. మానవత్వంతో కూడిన ప్రకాష్ రాజ్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన ట్వీట్ లోని మాటలు అందరికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఆయన పోస్ట్ కి.. యూ ఆర్ గ్రేట్, - హాట్సాఫ్ - మీ చెప్పినట్లుగానే పేదలకు మా వంతు సాయం చేస్తాం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇప్పటికే ప్రకాష్ రాజ్ కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో తన స్టాప్ కి మూడు నెలల జీతాలు ముందుగానే ఇచ్చి పంపించారట.