Begin typing your search above and press return to search.

తప్పలేదు.. తప్పుకున్నా- ప్రకాష్ రాజ్

By:  Tupaki Desk   |   23 Sep 2015 9:58 AM GMT
తప్పలేదు.. తప్పుకున్నా- ప్రకాష్  రాజ్
X
రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో అవకాశం అంటే ఎలాంటి నటుడైనా, టెక్నీషియన్ అయినా ఎగిరి గంతేసి ఒప్పుకుంటాడు. ఆ సినిమా చేస్తాడు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఆ అవకాశాన్ని కాదనుకున్నాడు. ‘కబాలి’ సినిమాలో ఓ కీలక పాత్ర చేయడానికి ముందు ఒప్పుకున్నా.. తర్వాత బయటికి వచ్చేశాడు. ప్రకాష్ రాజ్‌‌ కి వివాదాలు కొత్తేం కాదు కాబట్టి.. రజినీ సినిమా విషయంలో ఏం గొడవ జరిగిందా అని డౌట్లు మొదలయ్యాయి.

ఐతే ఆ అనుమానాలకు తెరదించుతూ.. రజినీ సినిమా నుంచి తప్పుకోవడంపై వివరణ ఇచ్చాడు ప్రకాష్ రాజ్. డేట్లు సర్దుబాటు చేయలేకే సినిమా నుంచి తప్పుకున్నానని ప్రకాష్ రాజ్ చెప్పాడు. ‘‘ప్రస్తుతం వేర్వేరు భాషల్లో చాలా సినిమాలు చేస్తున్నా. రజినీతో సినిమా చేయడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కబాలి మంచి కథ. నా పాత్ర కూడా చాలా బాగుంది. కానీ వరుసగా 60 రోజులు డేట్లు అడిగారు. సర్దుబాటు చేయలేకపోయాను. అందుకే తప్పుకోవాల్సి వచ్చింది. అలాంటి మంచి సినిమా నుంచి తప్పుకోవడం బాధగా ఉంది’’ అని చెప్పాడు ప్రకాష్ రాజ్.

రజినీతో కలిసి ప్రకాష్ రాజ్ ఒకే ఒక్కసారి నటించాడు. ‘నరసింహా’లో చిన్న క్యారెక్టర్ చేశాడు. ‘కబాలి’లో ఆయన పాత్ర కీలకమైందే. ఐతే మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేయడానికి ప్రణాళికలు రచించుకున్న దర్శకుడు రంజిత్.. నటీనటులందరి దగ్గర్నుంచి బల్క్ డేట్స్ తీసుకున్నాడు. ప్రకాష్ రాజ్ కు అది కుదరక తప్పుకున్నాడు. ఆయన పాత్రను జేడీ చక్రవర్తి రీప్లేస్ చేస్తుండటం విశేషం.