Begin typing your search above and press return to search.

నాన్ లోకల్ టాపిక్ కి అలా చెక్ పెట్టిన ప్ర‌కాష్ రాజ్‌

By:  Tupaki Desk   |   25 Jun 2021 12:30 PM GMT
నాన్ లోకల్ టాపిక్ కి అలా చెక్ పెట్టిన ప్ర‌కాష్ రాజ్‌
X
మూవీ ఆర్టిస్టుల సంఘం(మా) లో ఏడాది కాలంగా కొన‌సాగుతున్న వివాదాలే ప్ర‌కాష్ రాజ్ ని మా అధ్య‌క్ష ప‌ద‌వికి పురికొల్పాయ‌ట‌. ఆ విష‌యాన్ని ఆయ‌నే చెప్పారు. ఏడాది కాలంగా జ‌రుగుతున్న‌వి చూస్తూ ఊరుకోలేం క‌దా..! స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుగొనాల‌ని అనిపించింది. అందుకే అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసేందుకు చాలా ఆలోచించి మ‌థ‌నానిని లోన‌య్యాను. హ‌ఠాత్తుగా తీసుకున్న నిర్ణ‌యం కాదు ఇది.. అని ఆయ‌న అన్నారు. ఆ ర‌కంగా గ‌త అధ్య‌క్షుడైన వీకే న‌రేష్ హ‌యాంలో జ‌రిగిన వివాదాల లొల్లును నిల‌దీసే ప్ర‌య‌త్నం చేశారు.

న‌న్ను నాన్ లోక‌ల్ అంటూ నిల‌దీస్తున్నారు.. నేను తెలంగాణ‌లో ఊరిని ద‌త్త‌త తీసుకుని అభివృద్ధి చేస్తున్న‌ప్పుడు నాన్ లోక‌ల్ అన‌లేదే. నా కుమారుడిని ఇక్క‌డే చ‌దివిస్తున్నా. నా ఇల్లు ఆధార్ అడ్రెస్ ఇక్క‌డే ఉంది. కానీ నేను నాన్ లోక‌ల్ ఎలా అవుతాను. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌ నాకు పేరు హోదా గౌరవం ఇచ్చింది. అందుకే ఇక్కడ జరుగుతున్నవి చూస్తూ ఊరుకోలేను అని అన్నారు.

మార్చిలోనే జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు వాయిదా ప‌డితే ఆ విష‌యాన్ని ఎందుకు ఇన్నాళ్లు దాచారు? అని కూడా ప్ర‌కాష్ రాజ్ ప్ర‌శ్నించారు. అందుకే తాను సొంతంగా ప్యానెల్ ఏర్పాటు చేసుకున్నాన‌ని ప్ర‌స్తుతం అన‌ధికార సంఘం ప‌ని చేస్తోంద‌ని అన్నారు. సినీప‌రిశ్ర‌మ‌లో లోక‌ల్ నాన్ లోక‌ల్ ఉండ‌దు. తెలుగు వాడైన‌ విశాల్ వెళ్లి త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో చ‌క్రం తిప్ప‌డం లేదా? అని కూడా ప్ర‌శ్నించారు. త‌న‌కు జాతీయ అవార్డ్ వ‌స్తే.. 9 నందులు వ‌స్తే నాన్ లోక‌ల్ అన‌లేద‌ని మ‌న‌వాడే అన్నార‌ని ప్ర‌కాష్ రాజ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నేను ద‌త్త‌త తీసుకున్న కొండారెడ్డి ప‌ల్లి.. నా ఇల్లు.. నా ఆధార్ అన్నీ ఇక్క‌డే ఉన్నాయ‌ని ప్ర‌కాష్ రాజ్ వెల్లడించారు.