Begin typing your search above and press return to search.

'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ ఇదే..!

By:  Tupaki Desk   |   24 Jun 2021 4:06 PM GMT
మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ ఇదే..!
X
టాలీవుడ్ లో ప్రస్తుతం రెండు విషయాల గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. కరోనా పాండమిక్ తర్వాత ఇండస్ట్రీని ఎలా గాడిలో పెట్టాలనే అంశం ఒకటైతే.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల టాపిక్ మరొకటి. మరో రెండు నెలల్లో జరగనున్న 'MAA' ఎన్నికల కోసం ఇండస్ట్రీలో సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం పోటీకి దిగుతున్నట్లు మంచు విష్ణు - ప్రకాశ్‌ రాజ్‌ - జీవితా రాజశేఖర్‌ - హేమ ప్రకటించారు. దీంతో ఈ సారి టాలీవుడ్ లో నాలుగు స్తంభాలాట రసవత్తరంగా జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్‌ తన ప్యానల్‌ సభ్యుల వివరాలను ప్రకటించారు. మొత్తం 27 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలక్షణ నటుడు మాట్లాడుతూ.. 'మా' శ్రేయ‌స్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచ‌న‌ల‌ని ఆచ‌ర‌ణ‌లో పెట్టే దిశ‌గా.. 'మా' ప్రతిష్టకోసం.. న‌టీనటుల బాగోగుల కోసం..అందరి ఆశీస్సుల‌తో అండ‌దండ‌ల‌తో ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డటం కోసం 'మా' టీంతో రాబోతున్న విష‌యాన్ని తెలియ‌జేస్తున్నాను అన్నారు. ప‌ద‌వుల కోసం కాదు.. ప‌నులు చేయ‌డం కోసం మాత్రమే పోటీలో దిగుతున్నామని ఆయన తెలిపారు.

ప్రకాశ్‌ రాజ్‌ ప్రకటించిన తన ప్యానల్ లో జ‌య‌సుధ‌ - శ్రీకాంత్‌ - బెన‌ర్జీ - సాయికుమార్‌ - తనీష్‌ - ప్రగతి - అన‌సూయ‌ - స‌న - అనిత చౌద‌రి - సుధ‌ - అజ‌య్‌ - నాగినీడు - బ్రహ్మాజీ - ర‌విప్రకాష్‌ - స‌మీర్‌ - ఉత్తేజ్ - బండ్ల గణేష్ - ఏడిద శ్రీరామ్‌ - శివారెడ్డి - భూపాల్‌ - టార్జాన్‌ - సురేష్ కొండేటి - ఖ‌య్యుం - సుడిగాలి సుధీర్ - గోవింద‌రావు - శ్రీధ‌ర్‌ రావు ఉన్నారు. రాబోయే రోజుల్లో మంచు విష్ణు - జీవితా రాజశేఖర్‌ - హేమ కూడా తమ ప్యానల్ సభ్యుల వివరాలను ప్రకటించనున్నారు.