Begin typing your search above and press return to search.

జిమ్ లోనూ BOSS ని వ‌ద‌ల‌ని ప్ర‌కాష్ రాజ్

By:  Tupaki Desk   |   17 Aug 2021 12:01 PM IST
జిమ్ లోనూ BOSS ని వ‌ద‌ల‌ని ప్ర‌కాష్ రాజ్
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు గ‌త కొంత‌కాలంగా హీట్ పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్న‌డూ లేని విధంగా ఈసారి నువ్వా నేనా అంటూ ఆరుగురు అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్నారు. ఇందులో ప్ర‌ధాన పోటీ ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ మంచు విష్ణు మ‌ధ్య‌నే ఉండ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఇత‌రుల‌తో పోలిస్తే ప్ర‌కాష్ రాజ్ ప్ర‌చారం ప‌రంగా జ‌రంత స్పీడ్ మీద ఉన్నారు. అంద‌రి కంటే ముందే ప్యానెల్ ని ప్ర‌క‌టించి దూకుడు చూపించిన ఆయ‌న మెగా అండ‌దండ‌ల‌తో స‌త్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

ఇత‌ర స‌భ్యుల కంటే చాలా ముందే ప్ర‌కాష్ రాజ్.. మెగా బాస్ చిరంజీవిని క‌లిసి ఆశీస్సులు అందుకున్నార‌ని గుస‌గుస‌లు వినిపించాయి. ఇక మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు సైతం త‌మ అండ‌దండ‌లు ప్ర‌కాష్ రాజ్ కే ఉంటాయ‌ని ప్ర‌క‌టించ‌డంతో ఇక గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే ఈసారి మా అధ్య‌క్షుడు ప్ర‌కాష్ రాజే అంటూ ప్ర‌చారం సాగిపోతోంది.

తెగేదాకా లాగొద్దు.. అని ఓసారి.. జెండా ఎగరేస్తాం.. అని మరోసారి ట్వీట్ల‌తో వేడి పెంచిన ప్ర‌కాష్ రాజ్.. ఇటీవల అనూహ్యంగా షూటింగ్ లో ప్రమాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. శ‌స్త్ర చికిత్స అనంత‌రం విశ్రాంతి తీసుకుంటూ స‌డెన్ గా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. త‌న ప్యానెల్ స‌భ్యులు స‌పోర్ట‌ర్స్ తో సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. ప్రకాష్ రాజ్. జెండా వందనం అనంతరం టీమ్ అందరూ కలిసి లంచ్ పార్టీ లో చిలౌట్ చేశారు.

ఇంత‌లోనే వేకువ‌ఝామున మెగా BOSS చిరంజీవితో జిమ్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఈ సందర్భంగా చిరుతో దిగిన‌ ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ``నేటి తెల్లవారు ఝామున బాస్ ని జిమ్ లో కలిశాను. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స‌మ‌స్య‌ల‌ పరిష్కారం కోసం ఆయన చొరవ తీసుకోవడం సంతోషంగా ఉంది. మీరెప్పుడూ మాకు స్పూర్తి అన్నయ్య``.. అంటూ ఆప్యాయ‌త‌ను క‌న‌బ‌రిచారు. ANNAYA.. అంటూనే మెగా ఆశీస్సులు కొట్టేసిన ప్ర‌కాష్ రాజ్ అధ్య‌క్షుడు అవుతారా లేదా? అన్న‌ది ఎన్నిక‌లు అయితే కానీ తెలీదు. సెప్టెంబ‌ర్ లో `మా` ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అన్న‌ట్టు జిమ్ లో కలిసాక అన్న‌య్య‌తోనే బ్రేక్ ఫాస్ట్ కూడా కానిచ్చారా..?