Begin typing your search above and press return to search.

లెస్బియన్‌ గా అదరగొట్టిన తెలుగమ్మాయి

By:  Tupaki Desk   |   18 Dec 2020 4:14 PM GMT
లెస్బియన్‌ గా అదరగొట్టిన తెలుగమ్మాయి
X
హాలీవుడ్‌ కే పరిమితం అయిన లెస్బియన్‌ కథలు మెల్ల మెల్లగా ఇండియన్‌ ప్రేక్షకుల వద్దకు వస్తున్నాయి. హిందీతో పాటు ఇతర ఇండియన్‌ భాషల్లో కూడా లెస్బియన్‌ కథలతో సినిమాలు వెబ్‌ సిరీస్ లు సీరియల్స్‌ వస్తున్నాయి. అయితే పేరున్న హీరోయిన్స్ లెస్బియన్‌ లుగా నటించేందుకు మాత్రం ఒప్పుకోరు. కెరీర్‌ పరంగా ఇబ్బందులు ఎదురైతాయనే ఉద్దేశ్యంతో లెస్బియన్‌ గా నటించేందుకు ఆసక్తి చూపించరు. కాని అంజలి మాత్రం తాజాగా విడుదలైన నెట్‌ ఫ్లిక్స్ ఒరిజినల్‌ పావా కదైగల్‌ లో లెస్బియన్‌ గా నటించి అదరగొట్టింది.

ప్రముఖ నటి కల్కి కోచ్లిన్‌ తో ఈమె చేసిన రొమాన్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ కు నలుగురు ప్రముఖ దర్శకులు దర్శకత్వం వహించారు. ఒక్కో ఎపిసోడ్‌ లో ఒక్కో కథను విభిన్నంగా చూపించారు. ఈ వెబ్‌ సిరీస్ లో సాయి పల్లవి.. ప్రకాష్‌ రాజ్‌.. సిమ్రాన్‌ లు కూడా నటించారు. అంజలి.. కల్కి రొమాంటిక్ ఎపిసోడ్‌ కు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించాడు.

అంజలి ద్విపాత్రాభినయం చేసిన ఆ ఎపిసోడ్‌ మొత్తం వెబ్‌ సిరీస్ కు హైలైట్‌ గా ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా కల్కితో అంజలి లిప్‌ లాక్‌ సీన్‌ మరియు బెడ్‌ రూం సీన్స్‌ మరో లెవల్‌ అంటూ యూత్‌ ఆడియన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఒక స్టార్‌ హీరోయిన్‌ అయ్యి ఉండి అలాంటి పాత్రలకు ఒప్పుకోవడం నిజంగా హ్యాట్సాఫ్‌ అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.