Begin typing your search above and press return to search.

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ప్రగ్యా...?

By:  Tupaki Desk   |   21 July 2020 12:10 PM GMT
గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ప్రగ్యా...?
X
డేగ' అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత 'మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటించినా అమ్మడి కెరీర్ కి ఉపయోగపడలేదు. ఇక క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో కలిసి నటించిన 'కంచె' సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది ప్రగ్య. ఈ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోనుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రగ్యాకి చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోగా చేసిన కొన్ని సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ క్రమంలో 'గుంటూరోడు' 'న‌క్ష‌త్రం' 'జ‌య జాన‌కి నాయ‌క‌' 'ఓం నమో వేంకటేశాయ' 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రాల్లో నటించింది. అందాలు ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం అస్సలు కలిసి రాలేదు. ఇక అమ్మడు అఫైర్స్ తో వార్తల్లో నిలిచింది. అప్పట్లో ఓ దర్శకుడితో రిలేషన్ షిప్ కొనసాగించిందని ఇండస్ట్రీ జ‌నాలు తెగ చెవులు కొరుక్కున్నారు.

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ప్రగ్యా జైస్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందట. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రగ్యా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్లే అని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. అయితే అవ‌కాశం ఇవ్వ‌డం వ‌ర‌కు బాగానే ఉంది కానీ త‌న కెరీర్ కూడా హీరోయిన్ ప్ర‌ణీత కెరీర్ మాదిరిగా మూన్నాళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలిపోతుందేమో అని ప్ర‌గ్య భ‌య‌ప‌డుతోంద‌ట‌. పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమాతో బాపు బొమ్మ అనిపించుకున్న ప్ర‌ణీత ఇండస్ట్రీలో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకుంది కానీ వెంటనే క్రిందికి ప‌డిపోయింది. ఇప్పుడు తన కెరీర్ కి కూడా సేమ్ టు సేమ్ సిచ్యుయేషన్ వస్తుందేమో అని సన్నిహితుల దగ్గర వాపోతోందట. అస‌లే అవ‌కాశాలు లేవు.. వ‌చ్చిన గోల్డెన్ ఛాన్స్ ని వ‌దులుకోలేదు.. అలా అని ఒప్పుకుంటే ఇక మీడియం రేంజ్ హీరోలు ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌రూ అనే డౌట్స్ తన సన్నిహితుల దగ్గర వ్యక్తం చేస్తోందట ప్రగ్యా జైస్వాల్.