Begin typing your search above and press return to search.

అందాల ఎర‌కు చిక్క‌దులే ఏ చేపా ఓ పాపా..!

By:  Tupaki Desk   |   12 Dec 2020 12:30 PM GMT
అందాల ఎర‌కు చిక్క‌దులే ఏ చేపా ఓ పాపా..!
X
కంచె బ్యూటీ ప్ర‌గ్య జైశ్వాల్ ఇన్ స్టా ట్రీట్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌తో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్న భామ‌గా ఇటీవ‌ల గుర్తింపు తెచ్చుకుంది. బికినీ స్విమ్ సూట్ ఇన్ వోర్ .. థైషోస్.. దేనికైనా ఈ అమ్మ‌డు రెడీ.

గత ఆర్నెళ్ల కాలంలో ప్ర‌గ్య ఇన్ స్టా ఫోటోలు వీడియోలు యువ‌త‌రంలోకి వైర‌ల్ గా దూసుకెళుతూనే ఉన్నాయి. ఈ ఫోటోల‌కు వెర్రెత్తే న‌వ‌త‌రం లైక్ లు క్లిక్ ల‌తో అమ్మడిని ఫాలో చేస్తూనే ఉన్నారు.

అయితే ఇన్ని చేసినా ప్ర‌గ్య ఫేట్ మారిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. టాలీవుడ్ లో తాను ఆశించిన ఆ ఒక్క మెగా ఆఫ‌ర్ త‌న‌కు ద‌క్క‌డం లేదు. ఇంత‌కుముందు సైరా చిత్రంలో న‌టిస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపించినా ఆఫ‌ర్ ద‌క్క‌లేదు. ఇప్పుడు ప‌వ‌న్ స‌ర‌స‌న ఓ క్రేజీ చిత్రంలో ప్ర‌గ్య‌కు అవ‌కాశం ద‌క్కింద‌న్న ప్ర‌చారం సాగుతోంది. క‌నీసం ఈసారైనా మెగా ఆఫ‌ర్ ద‌క్కుతుంద‌నే ఆశిస్తున్నారు. త‌నదైన‌ హార్డ్ వ‌ర్క్ ప‌ట్టు విడుపు చూశాక అయినా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అవ‌కాశాలిస్తారేమో చూడాలి.