Begin typing your search above and press return to search.

ప్రేమించిన వాడితో మాత్రమే లిప్ లాక్ చేస్తుందట

By:  Tupaki Desk   |   14 July 2021 7:54 AM GMT
ప్రేమించిన వాడితో మాత్రమే లిప్ లాక్ చేస్తుందట
X
'కంచె' సినిమా తో తెలుగు వారికి పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ అదృష్టం కలిసి రాకపోవడంతో అన్ని బాగున్నా కూడా స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకోలేక పోతోంది. హీరోయిన్‌ గా సక్సెస్‌ లు పడకున్నా ఈ అమ్మడు మెల్ల మెల్లగా కెరీర్‌ లో కుదురుకునేందుకు వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ ను కాదనకుండా చేస్తూ ఇంకా టాలీవుడ్ లో కొనసాగుతూనే ఉంది.

తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం బాలయ్యతో అఖండ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. అఖండ సినిమా షూటింగ్‌ ఇటీవలే సెకండ్‌ వేవ్‌ తర్వాత పునః ప్రారంభం అయ్యింది. షూటింగ్ లో బాలయ్యతో పాల్గొన్న ఈ అమ్మడు మొదట ఆందోళన చెందిందట. 200 మంది జనాలను చూసి ఈ సమయంలో ఇంత మందితో షూటింగ్‌ చేయాలా అనే ఆందోళన ఆమెలో కలిగిందట. ప్రతి ఒక్కరు కూడా మాస్క్‌ ధరించి ఉన్నా కూడా ఏదో తెలియని ఆందోళన అంటూ తాజా చిట్‌ చాట్‌ లో ఈ అమ్మడు నెటిజన్స్ తో షేర్‌ చేసుకుంది.

నెటిజన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పడంతో పాటు ఇంకా పలు విషయాలను గురించి ఆమె మాట్లాడుతూ వచ్చింది. ఒక నెటిజన్‌ మీరు డేటింగ్‌ కు వెళ్లిన మొదటి రోజే పార్టర్‌ తో లిప్ లాక్ ముద్దును ఇష్టపడుతారా అంటూ ప్రశ్నించాడు. ఇతర హీరోయిన్స్ అయితే ఆ ప్రశ్నను లైట్ తీసుకునే వారు. కాని ప్రగ్యా మాత్రం సమాధానం ఇచ్చింది. ఆమె ఇచ్చిన సమాధానం అందరికి ఆమోదయోగ్యంగా ఉండటంతో సూపర్‌ ఆన్సర్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొదటి రోజు డేటింగ్‌ లో ఎవరు కూడా లిప్ లాక్ ముద్దులు పెట్టుకోరు. ఇద్దరి మద్య ప్రేమ ముదిరిన తర్వాత మాత్రమే ముద్దులు పెట్టుకుంటారు అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.

డేటింగ్‌ కు వెళ్లినంత మాత్రాన ప్రేమలో ఉన్నట్లుగా కాదు. ఇద్దరి మనసులు అర్థం చేసుకునేందుకు డేటింగ్‌ కు వెళ్తారు. అలా డేటింగ్‌ కు వెళ్లిన తర్వాత కొన్నాళ్లకు ఇద్దరు ఒక్కటి అవుతారు.. ప్రేమలో పడతారు. అప్పుడు ముద్దులు పెట్టుకోవడంలో తప్పులేదు అనేది ప్రగ్యా జైస్వాల్‌ అభిప్రాయం. ఇప్పటి వరకు ప్రేమలో పడలేదు అంటోన్న ప్రగ్యా జైస్వాల్‌ ప్రస్తుతానికి కెరీర్ పైనే పూర్తి దృష్టి అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. బాలయ్య అఖండ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఆ సినిమా సక్సెస్ అయితే ఈమె టాలీవుడ్ లో బిజీ అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా సక్సెస్‌ లు దక్కకున్నా కూడా సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అభిమానులతో చిట్ చాట్‌ చేస్తూ అందాల ప్రదర్శణతో ఆకట్టుకుంటూ ఉంటుంది. మరి ముందు ముందు అయినా ఈ అమ్మడికి టాలీవుడ్‌ లో టాప్ స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు వస్తుందో చూడాలి. ఈమె హైట్ కాస్త ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ మంది హీరోలకు ఈమె సెట్ అవ్వదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అఖండ సక్సెస్‌ అయితే ఈమె వాంటెడ్‌ హీరోయిన్స్ జాబితాలో చేరిపోతుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

అఖండ సినిమా సక్సెస్‌ బాలయ్య బోయపాటిలకు మాత్రమే కాకుండా ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్‌ కు కూడా చాలా కీలకంగా మారింది. త్వరలో షూటింగ్‌ ముగియబోతున్న అఖండ సినిమా విడుదల తేదీ విషయంలో అతి త్వరలోనే క్లారిటీ వస్తుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ ఏడాదిలోనే అఖండ విడుదల కోసం ప్లాన్‌ చేస్తున్నారు.