Begin typing your search above and press return to search.

ఎంత చేసినా కానీ టైమ్ బ్యాడ్ అవుతోంది ప్ర‌గ్యా!

By:  Tupaki Desk   |   2 Aug 2021 6:39 AM GMT
ఎంత చేసినా కానీ టైమ్ బ్యాడ్ అవుతోంది ప్ర‌గ్యా!
X
ముంబై బ్యూటీ ప్ర‌గ్యా జైశ్వాల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాల‌ని క‌ల‌లు కంది. కానీ అమ్మ‌డి కెరీర్ ఆశించిన విధంగా సాగ‌లేదు. కెరీర్ ఒడిదుడుకుల మ‌యం. ఒకానొక ద‌శ‌లో అవ‌కాశాలు జీరో అయిపోయినా త‌న ఛ‌రిష్మాను కాపాడుకునేందుకు ప్ర‌గ్య చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. వ‌రుస ఫోటోషూట్ల‌తో ఇన్ స్టా మాధ్య‌మంగా అగ్గి రాజేస్తూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉండ‌డం ఇటీవ‌ల ప్ల‌స్ అయ్యింది. అయితే క‌రోనా రాక‌తో తాను అంగీక‌రించిన సినిమాలు ఆల‌స్యం అవుతున్నాయి.

ప్ర‌గ్యా చివ‌రి సారిగా తెలుగులో `ఆచారి అమెరికా యాత్ర‌`లో న‌టించింది. ఆ త‌ర్వాత కొంత గ్యాప్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `అంఖ‌డ‌`లో హీరోయిన్ గా ల‌క్కీ ఛాన్స్ ద‌క్కింది. ఇదే ప్ర‌గ్యా కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ అని చెప్పాలి. ఈసినిమాపై త‌ను చాలా అశ‌లే పెట్టుకుంది. ప్ర‌స్తుతం సుదీర్ఘ షెడ్యూల్ లో షూటింగ్ మోడ్ లో ఉంది. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా చెన్నైలో జ‌రుగుతోంది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌గ్యా కూడా సెట్స్ కు హాజ‌రైంది. అయితే చెన్నై షూటింగ్ కి వెళ్లే క్ర‌మంలో జ‌ర్నీని ఎంత‌గానో ఆస్వాధించిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఇన్ స్టా వేదిక‌గా ఈ జ‌ర్నీలో అరుదైన‌ మూవ్ మెంట్స్ ని ఒక్కొక్క‌టిగా పంచుకుంటోంది. ట్రావెలింగ్ మ‌ధ్య‌లో హాట్ కాఫీ తాగ‌డం.. చెన్నై ప్ర‌కృతి ఆందాల్ని ఆస్వాధించ‌డం మొత్తంగా ప్ర‌గ్యా త‌మిళ‌నాడు అందాల్ని బాగా ఆస్వాధిస్తున్న ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఇక సినిమా షూటింగ్ స‌మయంలో వ‌ర్కింగ్ సండే అంటూ ఓ క్యాప్ష‌న్ ఇచ్చి రెస్ట్ లెస్ గా షూటింగ్ లో పాల్గొన్న‌ట్లు తెలిపింది.

గుడ్ మార్నింగ్ చెన్నై.. వ‌ణ‌క్కం చెన్నై అంటూ .. సండే మార్నింగ్ వాతావ‌ర‌ణం గురించి చెప్పుకొచ్చింది. ఇక ప్ర‌గ్య డెనిమ్ జీన్స్ డ్రెస్ లో స్పెష‌ల్ త్రోబ్యాక్ లుక్ ని షేర్ చేయ‌గా హీట్ పెంచుతోంది. ఇక షూట్ మ్యాట‌ర్ ని ట‌చ్ చేసిన ఈ బ్యూటీ.. నో ఫిల్ట‌ర్ ..డే 61 అని అంఖ‌డ షూటింగ్ రోజుల గురించి చెప్పుకొచ్చింది.

అఖండ షూటింగ్ మొద‌లు పెట్టి నిన్న‌టికి 61 రోజులు పూర్త‌య్యాయి. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న మ‌రో భారీ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. సింహా- లెజెండ్ త‌ర్వాత బాల‌య్య‌-బోయ‌పాటి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న చిత్రం కూడా ఇదే. దీంతో సినిమాపై అంచ‌నాలు భారీగా ఏర్ప‌డుతున్నాయి.