Begin typing your search above and press return to search.

సూప‌ర్ మ‌చ్చీ అంటున్న ప్ర‌గ్యా

By:  Tupaki Desk   |   4 Jun 2016 5:30 PM GMT
సూప‌ర్ మ‌చ్చీ అంటున్న ప్ర‌గ్యా
X
కంచె భామ ప్ర‌గ్యా జైశ్వాల్ సూప‌ర్ మ‌చ్చీ... అని పాడుకొంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా గ‌డుపుతోంది. అప్పుడెప్పుడో అల్లు అర్జున్ పాడుకొన్న ఆ పాట‌తో ఇప్పుడు ప్ర‌గ్యాకి ఏం ప‌ని అనేదేగా మీ సందేహం. ఆ పాట‌తో ప్ర‌గ్యాకి నిజంగానే ఓ అవ‌స‌రం వ‌చ్చింది. స్టేజీపైన తొలిసారి అదే పాట‌లో డ్యాన్స్ వేసి అంద‌రినీ ఆక‌ర్షించాల‌ని ప్లాన్ చేసింది. అందుకే రేయింబ‌వ‌ళ్లు అదే పాట‌తోనే కుస్తీ ప‌డుతూ రిహార్స‌ల్స్ చేస్తోంది.

ఇంత‌కీ ప్ర‌గ్యా ఎక్క‌డ ఆ పాట‌ని ప్ర‌ద‌ర్శిస్తుందో తెలుసా? ....సింగ‌పూర్‌ లో జ‌రిగే సైమా వేడుక‌లో. సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ ఆవార్డ్స్ పేరిట ప్రతీ యేడాదీ ఓ వేడుక జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అందులో తార‌లు త‌ళుక్కున మెరుస్తుంటారు. నాలుగు భాష‌ల‌కి చెందిన ప‌రిశ్ర‌మ‌లు పాల్గొంటాయి కాబ‌ట్టి ఆ వేదిక‌పై ఆడిపాడితే తార‌ల‌కి మంచి ఎక్స్‌ పోజ‌ర్ ఉంటుంది. అందుకే కుర్ర‌భామ‌లు త‌మ టాలెంట్‌ ని చూపించ‌డానికి ఆ వేదిక‌ని ఉప‌యోగిస్తుంటాయి. ఈ యేడాది సింగ‌పూర్‌ లో జ‌ర‌గ‌నున్న సైమాలో డ్యాన్స్ షో చేయ‌డానికి ప్ర‌గ్యా జైశ్వాల్‌ - ప్ర‌ణీత‌ - అమైరా ద‌స్తూర్‌ లాంటి అంద‌గ‌త్తెలు సిద్ధ‌మ‌వుతున్నారు. అల్లు అర్జున్ చిత్రం స‌న్నాఫ్ స‌త్యమూర్తిలోని సూప‌ర్ మ‌చ్చీ పాట‌కి ప్ర‌గ్యా జైశ్వాల్ డ్యాన్స్ వేయ‌బోతోంద‌ట‌. ఆ విష‌యాన్ని స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టిందా భామ‌. మ‌రి సూప‌ర్ మ‌చ్చీగా జైశ్వాల్ ఏం రేంజులో అల్ల‌రి చేస్తుందో చూడాలి.