Begin typing your search above and press return to search.

మెగా హీరోయిన్.. మంచి హుషారే!

By:  Tupaki Desk   |   30 Oct 2015 3:18 PM GMT
మెగా హీరోయిన్.. మంచి హుషారే!
X
ఇదివ‌ర‌కు మెగా హీరోయిన్ అనిపించుకోవాలంటే ఎదురు చూడాల్సి వ‌చ్చేది. ఆ అవ‌కాశం ఏ ఒక‌రిద్ద‌రికో వ‌చ్చేది. కార‌ణం అప్ప‌ట్లో చిరు - ప‌వ‌న్‌ లు మాత్ర‌మే న‌టించేవాళ్లు. అల్లు అర్జున్‌ - చెర్రీలు కూడా రంగంలోకి దిగాక కొంచెం సుల‌భ‌మైపోయింది. కానీ ప్ర‌స్తుతం ఏడుగురు హీరోలు ఆ కుటుంబానికి చెందిన‌వారే కాబ‌ట్టి మెగా హీరోయిన్లు చాలా మందే బ‌య‌టికొస్తున్నారు. తాజాగా వ‌రుణ్‌ తేజ్‌ తో `కంచె`లో నటించిన ప్ర‌గ్యాజైశ్వాల్ మెగా హీరోయిన్ అయిపోయింది.

ఇదివ‌ర‌కు మిర్చిలాంటి కుర్రాడుతోనే తెలుగుకి ప‌రిచ‌య‌మైన‌ప్ప‌టికీ... గుర్తింపు మాత్రం `కంచె`తోనే వ‌చ్చింది. మెగా హీరోయిన్ అనే కార్డు మెడ‌లో ప‌డిన ఫ‌లిత‌మో ఏంటో తెలియ‌దు కానీ... ప్ర‌గ్యాలో కాన్ఫిడెన్స్ కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. చూడ్డానికి అమాయ‌కంగా, నాజూగ్గా క‌నిపిస్తోంది కానీ... మంచి హుషారైన‌దే. తెలుగు ఇండ‌స్ట్రీ నాడిని అప్పుడే ప‌ట్టేసిన‌ట్టు క‌నిపిస్తోంది. కంచె ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ద‌ర్శ‌కుడు క్రిష్ ప్ర‌గ్యాని అటు ఇటు బాగా తిప్పుతున్నాడు. మీడియాలోనూ ఆమెని హైలెట్ చేయిస్తున్నాడు. ఆ అవ‌కాశాల‌న్నింటినీ ప్ర‌గ్యా బాగానే యూజ్ చేసుకొంటున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇటీవ‌ల మా టాకీస్ కార్య‌క్ర‌మంలో ప్ర‌గ్యా పాల్గొంది. అందులో తెలుగు పాట‌ని గ‌డ‌గ‌డా పాడేసి అదుర్స్ అనిపించింది. అలాగే సుమ యాంక‌రింగ్‌ లో వ‌స్తున్న స్టార్‌ మ‌హిళ ప్రోగ్రాంలోనూ క్రిష్‌ - ప్ర‌గ్యా పాల్గొన్నారు. అందులో కూడా ఆమె తెలుగు నేర్చుకొంటున్నాను, త్వ‌ర‌లోనే మాట్లాడ‌తాను అని అచ్చ‌మైన తెలుగులో చెప్ప‌డంతో సుమ ఫ్లాట‌యిపోయింది. ప్ర‌గ్యా టీవీల్లో చేస్తున్న సంద‌డిని చూసి సినిమా జ‌నాలంతా ఈ అమ్మాయికి మంచి ఫ్యూచ‌రే ఉంది అని మాట్లాడుకొంటున్నారు. నిజంగానే ప‌లువురు స్టార్‌ హీరోల సినిమాల‌కోసం ఇటీవ‌ల ప్ర‌గ్యా ఆడిష‌న్లు కూడా చేసిన‌ట్టు తెలుస్తోంది.