Begin typing your search above and press return to search.

నాగ్ మూవీలో కంచె హీరోయిన్

By:  Tupaki Desk   |   23 April 2016 10:48 AM IST
నాగ్ మూవీలో కంచె హీరోయిన్
X
క్రిష్ దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ సరసన కంచె సినిమాలో నటించిన ప్రగ్యా జైస్వాల్.. తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అందంతో పాటు ఒడ్డు - పొడుగు - పర్సనాలిటీ - పెర్ఫామెన్స్.. ఇలా అన్ని కోణాల్లోనూ అమ్మడి ట్యాలెంట్ ఎక్కువగానే ఉంది. అందుకే ఇప్పుడు ఓ భక్తిరస చిత్రంలో ప్రగ్యకు అవకాశం వచ్చిందని తెలుస్తోంది.

కంచెలో ప్రగ్యా జైస్వాల్ నటనను చూసి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు బాగా ముచ్చట పడ్డారట. అందుకే ఆమెకు తను ప్రస్తుతం తీయబోతున్న 'ఓం నమో వెంకటేశ' చిత్రంలో ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. తిరుమల వేంకటేశ్వరుని మహాభక్తుడైన హథీరాం బాబా జీవిత కథే ఈ చిత్రంలో.. ఇందులో హథీరాంగా నాగార్జున నటించబోతున్నారు.

'ఓం నమో వెంకటేశా'లో ప్రగ్యా జైస్వాల్ కి ఓ పాత్ర ఖాయమైంది. జూన్ లో షూటింగ్ ప్రారంభం కానుండగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఎంఎం కీరవాణి ఇప్పటికే రెండుపాటలకు స్వరాలు సమకూర్చారు. రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్ లో అన్నమయ్య - శ్రీరామదాసు - షిర్డీ సాయి తర్వాత వస్తున్న నాలుగో భక్తి చిత్రం ఈ ఓం నమో వెంకటేశా.