Begin typing your search above and press return to search.

కంచె బ్యూటీ టాప్ యాంగిల్ సెల్ఫీ వైర‌ల్

By:  Tupaki Desk   |   13 May 2021 4:30 AM GMT
కంచె బ్యూటీ టాప్ యాంగిల్ సెల్ఫీ వైర‌ల్
X
`కంచె` బ్యూటీ ప్ర‌గ్యా జైశ్వాల్ ప్రొఫెష‌న‌ల్ కెరీర్ ఎలా ఉన్నా.. ప‌ర్స‌న‌ల్ గా బోలెడంత ప‌బ్లిసిటీ కొట్టేస్తోంది. ప్ర‌గ్యా సోష‌ల్ మీడియాల్లో ఫ్యాన్స్ కి ట‌చ్ లో నే ఉంటోంది. ఇటీవ‌ల వ‌రుస ఫోటో షూట్ల‌తో ఫ్యాన్స్ కి ట్రీటిస్తోంది. ప‌నిలో ప‌నిగా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్ని షేర్ చేస్తూ ల‌క్ష‌ల్లో ఆర్జిస్తోంది.

తాజాగా మ‌రో హాట్ సెల్ఫీని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది. వైట్ క‌ల‌ర్ ఇన్న‌ర్ వేర్ లో టాప్ యాంగిల్ ఫోజుతో ప్ర‌గ్య‌ హాట్ గా ద‌ర్శ‌నమిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. నెటిజ‌నులు ఈ ఫోటోకి త‌మ‌దైన‌ శైలిలో కామెంట్లు చేస్తూ అభిమానం కురిపిస్తున్నారు.

సెకండ్ వేవ్ క‌ల్లోలం వ‌ల్ల‌ ఎక్క‌డి షూటింగ్ ల‌కు అక్క‌డే నిలిచిపోవ‌డంతో సెల‌బ్రిటీలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. సెకెండ్ వేవ్ కి సంబంధించి కొంద‌రు అవేర్ నెస్ క్యాపెనింగ్ లు చేస్తుంటే ..మ‌రికొంద‌రు ఇలా సెల్ఫ్‌ ప్ర‌చారానికి పూనుకుంటున్నారు.

ఇక ఇటీవ‌ల నెమ్మ‌దిగా ప్ర‌గ్యా జైస్వాల్ కెరీర్ గాడిన ప‌డుతోంది. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న బోయ‌పాటి తెర‌కెక్కిస్తున్న భారీ చిత్రం `అఖండ‌`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తోంది. ఈ రెండిటిపైనా హాట్ ప్ర‌గ్య బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకుంది.

ప్ర‌గ్య‌ తెలుగులో చివ‌రి సారిగా ఆచారి అమెరికాయాత్ర‌లో న‌టించింది. అప్ప‌టి నుంచి దాదాపు రెండేళ్లుగా ఖాళీగానే ఉంది. మ‌ళ్లీ బాల‌య్య-బోయ‌పాటి `అఖండ`కు ఎంపిక చేసి ఆశ‌లు క‌ల్పించారు. ప‌వ‌న్ త‌దుప‌రి చిత్రంలోనూ ప్ర‌గ్య న‌టించే అవ‌కాశాలున్నాయ‌న్న క‌థ‌నాలు ఇటీవ‌ల వైర‌ల్ అవుతున్నాయి. కానీ దానిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంటుంది. మంచు విష్ణు స‌ర‌స‌నా ప్ర‌గ్య‌కు ఓ ఆఫ‌ర్ ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.