Begin typing your search above and press return to search.

వేడి పెంచుతున్న బోల్డ్ బ్యూటీ ప్ర‌గ్య అందాలు

By:  Tupaki Desk   |   7 April 2021 11:30 AM GMT
వేడి పెంచుతున్న బోల్డ్ బ్యూటీ ప్ర‌గ్య అందాలు
X
నిరంత‌రం ఏదో ఒక యాక్టివిటీతో అభిమానుల‌కు ట‌చ్ లో ఉండ‌డం ఎలానో ముంబై భామ‌ల‌కు తెలిసినంత‌గా వేరొక‌రికి తెలీదేమో. బోల్డ్ బ్యూటీ ప్ర‌గ్య జైశ్వాల్ ఈ విష‌యంలో ఎక్క‌డా త‌గ్గేదే లేదు.

గ‌త కొంత‌కాలంగా ప్ర‌గ్య జైశ్వాల్ నిరంత‌ర ఇన్ స్టా ట్రీట్ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్. ఈ ప్ర‌చార‌ వేదిక‌పై వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. వ‌రుస బికినీ షూట్లు.. మ్యాగ‌జైన్ షూట్ల‌తో పాటు.. సంథింగ్ స్పెష‌ల్ ఫోటోలు వీడియోల్ని ఇన్ స్టాలో షేర్ చేస్తోంది. ఇక యోగా జిమ్మింగ్ వీడియోల‌తోనూ ప్ర‌గ్య విరుచుకుప‌డుతోంది.

తాజాగా మ‌రోసారి ప్ర‌గ్య జైశ్వాల్ జిమ్ చేస్తున్న వీడియోని రిలీజ్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. ఈ వీడియోలో ర‌క‌ర‌కాల లొకేష‌న్లు క‌నిపిస్తున్నాయి. ప్ర‌గ్య ఓ ఐదు న‌క్ష‌త్రాల హోట‌ల్ ప‌రిస‌రాల్లో ప్ర‌త్య‌క్ష‌మైంది. అలాగే జిమ్ లోనూ శ్ర‌మిస్తూ క‌నిపించింది. ``మీరు ఎక్క‌డ నివ‌శించినా మీ శ‌రీర ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా చూస్కోండి.. హ్యాపీ వ‌ర‌ల్డ్ హెల్త్ డే `` అంటూ వ్యాఖ్య‌ను ప్ర‌గ్య జోడించింది. నివ‌శించే ప్లేస్ ఏద‌నా ఎక్క‌డికి వెళ్లినా జిమ్మింగ్ జాగింగ్ వంటి వాటిని విడిచిపెట్టొద్ద‌నే అర్థం త‌న మాట‌ల్లో ధ్వ‌నించింది. ఇక ప్ర‌గ్య హోట‌ల్ ప‌రిస‌రాలు అయినా షూటింగ్ స్పాట్ అయినా.. జిమ్ అయినా క‌స‌ర‌త్తులు విడువ‌న‌ని చెప్ప‌క‌నే చెప్పిందిలా.

ఇక ఈ వీడియోతో పాటు ప్ర‌గ్య స్పెష‌ల్ హాట్ లుక్ లో ఉన్న వేరొక‌ ఫోటోషూట్ అంతే వైరల్ గా మారింది. ఈ ఫోటోలో బ్రాండెడ్ స్పోర్ట్స్ ఇన్న‌ర్ ధ‌రించిన ప్ర‌గ్య అందాలు అంత‌కంత‌కు వేడి పెంచుతున్నాయి. ఈ భామ‌ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే ఇటీవ‌లే స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది. ఇటు తెలుగులోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్ చిత్రంలో న‌టిస్తోంద‌న్న ప్ర‌చారం ఉంది.