Begin typing your search above and press return to search.

అలా న‌వ్వి గూగ్లీ వేసిన ప్ర‌గ్య జైశ్వాల్

By:  Tupaki Desk   |   6 Jun 2021 7:00 AM IST
అలా న‌వ్వి గూగ్లీ వేసిన ప్ర‌గ్య జైశ్వాల్
X
అందంగా న‌వ్వ‌డం ఒక క‌ళ‌. న‌వ్వుతోనే స‌గం ఎదుటివారి ఇంప్రెష‌న్ కొట్టేయొచ్చు. ఇదిగో కంచె బ్యూటీ ప్ర‌గ్య జైశ్వాల్ చేస్తున్న‌ది అదే. అలా కోల్గేట్ యాడ్ లో స‌చిన్ టెండూల్క‌ర్ లా ఎంతో ఆహ్లాదంగా స్వేచ్ఛ‌గా న‌వ్వేస్తోంది. ఇటీవ‌ల‌ వ‌రుస అవ‌కాశాల్ని క్యాచ్ చేస్తోంది.

తాజా ఫోటోషూట్ లో బ్లూ డెనిమ్స్.. దానికి కాంబినేష‌న్ గా హాఫ్ షోల్డ‌ర్ స్వెట్ ష‌ర్ట్ ధ‌రించి ప్ర‌గ్య ఎంతో బ్యూటిఫుల్ గా క‌నిపిస్తోంది. గ‌త కొంత‌కాలంగా కెరీర్ ప‌రంగా స్వింగ్ లో ఉన్న ప్ర‌గ్య ఎన్బీకే స‌ర‌స‌న బోయ‌పాటి తెర‌కెక్కిస్తున్న అఖండ చిత్రంలో న‌టిస్తోంది. ప‌వ‌న్ స‌ర‌స‌న త‌దుప‌రి చిత్రంలో ప్ర‌గ్య లాక్ అయ్యింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు మోహ‌న్ బాబు - డైమండ్ ర‌త్న‌బాబు చిత్రం స‌న్ ఆఫ్ ఇండియా లోనూ ప్ర‌గ్య నాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా టీజ‌ర్ ని స్టార్ హీరో సూర్య ఆవిష్క‌రించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ టీజర్ కి వాయిస్ ఓవ‌ర్ అందించ‌డం మ‌రో కొస‌మెరుపు.

అలాగే బాలీవుడ్ లో స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న భారీ యాక్ష‌న్ చిత్రంలో నాయిక‌గా న‌టిస్తోంది. కెరీర్ ప‌రంగా మునుపెన్న‌డూ లేనంత జోష్ తో ఉంది. బ‌హుశా అదంతా ఫోటోషూట్ల‌లోనూ క‌నిపిస్తోంది. ఇంత‌కాలానికి స్లార్ హీరోల‌తో అవ‌కాశాలు రావ‌డంతో ఆ ఆనందాన్ని ప్ర‌గ్య ఏమాత్రం దాచుకోవ‌డం లేదు. ఇదే హుషారులో తెలుగు - హిందీలో మ‌రింత బిజీ అయిపోతుందేమో చూడాలి.