Begin typing your search above and press return to search.

ప్ర‌గ్యకు `హాటెస్ట్ ఆఫ్ ది ఇయ‌ర్` అవార్డ్ ఇవ్వాలి

By:  Tupaki Desk   |   30 April 2021 6:30 AM GMT
ప్ర‌గ్యకు `హాటెస్ట్ ఆఫ్ ది ఇయ‌ర్` అవార్డ్ ఇవ్వాలి
X
ముంబై బ్యూటీ ప్ర‌గ్య జైశ్వాల్ టాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా కొన‌సాగుతున్నా ఆశించిన పెద్ద రేంజుకు చేరుకోవ‌డంలో త‌డ‌బ‌డింది. ఈ బ్యూటీకి కేవ‌లం ఒక సెక్ష‌న్ స్టార్ల నుంచి మాత్ర‌మే అవ‌కాశాలు ద‌క్కాయి. దీంతో కెరీర్ ప‌రంగా రేసులో ఎంతో వెన‌క‌బ‌డాల్సొచ్చింది..

కానీ ప్ర‌గ్య పెద్ద రేంజు హీరోల స‌ర‌స‌న న‌టించి త‌న స్టార్ డ‌మ్ ని విస్త‌రించుకునేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. త‌న లాంగ్ వెయిట్ ఫ‌లించి చివ‌రికి స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న యాంటిమ్ అనే భారీ చిత్రంలో అవ‌కాశం ద‌క్కించుకుంది. అలాగే ప‌వ‌న్ స‌ర‌స‌న త‌దుప‌రి చిత్రంలో న‌టిస్తోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

మ‌రోవైపు ఈ క్రేజును నిల‌బెట్టుకునేందుకు సోష‌ల్ మీడియాల ద్వారా అభిమానుల‌కు నిరంత‌రం ట‌చ్ లో ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ ప్ర‌గ్య లైమ్ లైట్ లో ఉంది. తాజాగా ఈ ముంబై బ్యూటీ షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. బ్లాక్ ఇన్న‌ర్ లో ప్ర‌గ్య అందాలు హీట్ పుట్టిస్తున్నాయి. సోష‌ల్ మీడియాల్లో ప‌లు బ్రాండ్ల‌కు ప్ర‌చారం చేస్తూ ప్ర‌గ్య బాగానే ఆర్జిస్తోంది. ఇది కూడా ఈ కేట‌గిరీనే అని అర్థమ‌వుతోంది. ఇక ఇదే తీరుగా కిల్ల‌ర్ లుక్ తో క‌ట్టిప‌డేస్తూ ఈ బ్యూటీ మునుముందు మ‌రిన్ని పెద్ద అవ‌కాశాలు ద‌క్కించుకుంటుందేమో చూడాలి.